Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్య వివాహాలను అరికట్టాలి.. బాలికల విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి:జిల్లా సమన్వయకర్త గడ్డం పల్లవి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 08:20 PM

పేదవాడి సొంతింటి కల కాంగ్రెస్‌తోనే సాధ్యం: మున్సిపల్ చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్

13-07-2026 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల నిజం కావాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, అది కేవలం కాంగ్రెస్‌ హయాంలోనే సాధ్యమవుతుందని చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ స్పష్టం చేశారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో మహమ్మద్ రహమత్ నూతనంగా నిర్మించుకున్న 'ఇందిరమ్మ ఇల్లు'ను ఆదివారం ఆమె రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ పావని రమేష్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలనే ఒక గొప్ప సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి ఆశీస్సులు, సహకారం నియోజకవర్గ పేద ప్రజలకు ఎల్లప్పుడూ ఉంటాయని ఆమె భరోసా ఇచ్చారు.ఈ గృహప్రవేశ మహోత్సవ కార్యక్రమంలో 17వ వార్డు కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసర్ల శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్లు ఎండీ హన్నుబాయి, పాక చిరంజీవి, కో-ఆప్షన్ మెంబర్స్ పస్తం గంగ రాములు, ఎండీ బాబా షరీఫ్, షాదీఖానా చైర్మన్ ఎండీ కరీం, స్థానిక నాయకులు ఎండీ ఎజాస్ పాషా, ఎండీ గౌష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పేదవాడి సొంతింటి కల కాంగ్రెస్‌తోనే సాధ్యం: మున్సిపల్ చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News