Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:25 PM

ఆర్యవైశ్యుల సంక్షేమమే ధ్యేయంగా...

ఆర్యవైశ్యుల సంక్షేమమే ధ్యేయంగా...

ఆర్యవైశ్యుల సంక్షేమమే ధ్యేయంగా...
13-07-2026 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

జిల్లాలోని ఆర్యవైశ్యుల సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తున్నామని సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వెంపటి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుపేద ఆర్యవైశ్యులకు అమలు చేయదలచిన సంక్షేమ పథకాలపై ఆదివారం స్థానిక కాశీనాథం ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆర్యవైశ్యులలో నిరుపేదలు, మధ్యతరగతి వారికి విద్య, వైద్యం, జీవనోపాధి అవకాశాలు కష్టతరంగా మారిన నేపద్యంలో ఆయా తరగతుల వారికి వైద్య సదుపాయాలను, జీవనోపాధి అవకాశాలను కల్పించేందుకు తమ సంఘం ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామన్నారు. పేద ఆర్యవైశ్యులకు వైద్యం తక్కువ ఖర్చుతో అందించేందుకు ఆర్యవైశ్య కుటుంబ ఆరోగ్య కార్డులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలోని 23 మండలాలు, ఐదు మునిసిపాలిటీలలోని పేద, మధ్యతరగతి ఆర్యవైశ్యుల వివరాలను సంబంధిత మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షుల ద్వారా సేకరించి అర్హులందరికీ ఆరోగ్యకార్డులను జారీ చేస్తామన్నారు. ఈ కార్డులతో జిల్లాలోని ఆర్యవైశ్య వైద్యుల వద్ద రాయితీ పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. మండల అధ్యక్షులు తమ పరిధిలోని గ్రామాలలోని పేద ఆర్యవైశ్యుల వివరాలను సేకరించి జిల్లా సంఘ కార్యాలయానికి అందజేయాలన్నారు. అదేవిధంగా ఆర్యవైశ్య కుటుంబాలలోని మహిళలకు జీవనోపాధి కల్పించేందుకు జిల్లాలోని పేద ఆర్యవైశ్య మహిళలకు 100 కుట్టుమిషన్లను అందజేసేందుకు ప్రణాళికలను రూపొందించామన్నారు. మహిళా లబ్ధిదారులను సైతం ఆయా మండలాల అధ్యక్షులు గుర్తించి జిల్లా సంఘానికి అందజేయాలన్నారు. వ్యాపార ప్రపంచంలో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో ఆర్యవైశ్య వర్తకులు, వ్యాపారులు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఆర్యవైశ్యులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వాటిని ఎదుర్కొని వారికి న్యాయం చేసేందుకు జిల్లా సంఘం సిద్ధంగా ఉందన్నారు. పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు మాట్లాడుతూ జిల్లా ఆర్యవైశ్య సంఘం చేపడుతున్న సంక్షేమ పథకాలు అభినందనీయమన్నారు. జిల్లాలో పేద ఆర్యవైశ్యుల అభివృద్ధికి తామందరూ ఆర్థికంగా, హార్దికంగా చేయూతనిస్తూ సంఘ ఐకమత్యానికి, బలోపేతానికి తోడ్పడతామన్నారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం వెబ్సైట్ను సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు కర్నాటి కిషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇటీవల తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో పదవులు పొందిన వారికి జిల్లా సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైశ్య సంఘ నాయకులు గరినై కోటేశ్వరరావు, బొమ్మిడి లక్ష్మీనారాయణ,బండారు రాజా, చల్లా లక్ష్మీకాంత్, మాశెట్టి అనంతరాములు, వెంపటి మధు, చెన్నకేశవరావు, ఇమ్మడి రమేష్, గరినే శ్రీధర్,వంగవీటి శ్రీనివాసరావు, నూనె నాగన్న, ఓరుగంటి కిట్టు, పైడిమర్రి నారాయణరావు, పైడిమర్రి వెంకటనారాయణ,బచ్చు రామారావు, గరిన వెంకటేశ్వర్లు, వాసవి క్లబ్ బాద్యులు, వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు,జిల్లా బాధ్యులు పాల్గొన్నారు.

Sthanikam

ఆర్యవైశ్యుల సంక్షేమమే ధ్యేయంగా...

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News