Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:27 AM

బాపన్ బాయి తండాలో ఘనంగా ‘ సీత్లా భవాని’ సంప్రదాయ పండుగ,

07-07-2026 365 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

​తుంగతుర్తిమండల పరిధిలోని బపన్ బాయి, కర్నాలకుంట, సంధ్య తండాలో గిరిజనుల ఆరాధ్య దైవమైన సీత్లా భవాని సంప్రదాయ పండుగను మంగళవారం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. బంజారా గిరిజనుల విశిష్ట సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే ఈ వేడుకల్లో తండా ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆషాఢ మాసంలో గ్రామ ప్రజల ఆరోగ్యం, పశుసంపద రక్షణ, సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ ఈ పండుగను నిర్వహించడం ఇక్కడి ఆనవాయితీ.ఈ సందర్భంగా తండాకు చెందిన ఆడపడుచులు సంప్రదాయ గిరిజన వేషధారణలో అమ్మవారికి బోనాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తండా పెద్దలు సంప్రదాయ ఆచారాల ప్రకారం సగౌరవంగా అమ్మవారికి కోడిపుంజులను బలి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బంజారా జానపద విశ్వాసం ప్రకారం సప్త భవానులను (ఏడు మాతృదేవతలను) ప్రత్యేకంగా పూజించి, సామూహిక ప్రార్థనలు చేశారు. డోలు, డప్పుల నాదాలు, సంప్రదాయ గేయాల నడుమ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడంతో తండాలో పండుగ వాతావరణం సంతరించుకుంది.ఈ వేడుకల్లో బాపన్ భాయ్ తండా గ్రామ సర్పంచ్ బికోజి ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. సీత్లా భవాని పండుగ బంజారా గిరిజనుల సాంస్కృతిక వారసత్వానికి, సామాజిక ఐక్యతకు, ప్రకృతి పట్ల వారికి గల గౌరవానికి ప్రతీక అని కొనియాడారు. ప్రపంచీకరణ ప్రభావంతో అంతరించిపోతున్న గిరిజన సంప్రదాయాలను, భాషను, జానపద కళలను యువత పరిరక్షించి భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు.దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని బంజారాలు ఈ పండుగను ఒకే రోజు జరుపుకోవడం గిరిజనుల సాంస్కృతిక ఐక్యతకు నిదర్శనమన్నారు. గిరిజనుల విశిష్ట సంస్కృతికి తగిన గౌరవం కల్పించేలా, శ్రీ సీత్లా భవాని పండుగను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక రాష్ట్ర పండుగగా గుర్తించి, ఆ రోజున ప్రభుత్వ సెలవు ప్రకటించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తండావాసులు పాల్గొన్నారు.

Sthanikam

బాపన్ బాయి తండాలో ఘనంగా ‘ సీత్లా భవాని’ సంప్రదాయ పండుగ,

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News