Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:12 PM

మొక్కలు నాటి పచ్చని భవిష్యత్తుకు బాటలు వేయాలి

07-07-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​* గాయత్రి పాఠశాలలో వనమహోత్సవం.. భారత్ వికాస్ పరిషత్ కార్యదర్శి యువరాజు

ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటి, దానిని బాధ్యతగా సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని భారత్ వికాస్ పరిషత్ కొమురంభీమ్ శాఖ కార్యదర్శి చినుకని యువరాజు పిలుపునిచ్చారు. మండల పరిధిలోని గుడిమల్కాపురం గ్రామ శివారులో గల శ్రీ గాయత్రి పాఠశాల ఆవరణలో సోమవారం వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటారు.

​ఈ సందర్భంగా యువరాజు మాట్లాడుతూ.. మొక్కలు మనకు ప్రాణవాయువును, స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడమే కాకుండా వర్షపాతానికి, నీడకు ఎంతో దోహదపడతాయని వివరించారు. పచ్చని భవిష్యత్తుకు చెట్లే మూలాధారమన్నారు. అనంతరం విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేస్తూ.. తాము నాటిన మొక్కలను వృక్షాలుగా పెంచేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల చైర్మన్ పసుపులేటి నరేంద్ర కృష్ణ, పాఠశాల ఇంచార్జి ఆనంద్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

మొక్కలు నాటి పచ్చని భవిష్యత్తుకు బాటలు వేయాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News