Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:27 PM

వియాస్ ఫార్మాలో కెమికల్ లీక్ కలకలం

వియాస్ ఫార్మాలో కెమికల్ లీక్ కలకలం

వియాస్ ఫార్మాలో కెమికల్ లీక్ కలకలం
23-06-2026 287 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

అస్వస్థతకు గురైన విద్యార్థులు, రైతులు.. యాజమాన్యంపై చర్యలు కోరుతున్న స్థానికులు

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెరపల్లి సమీపంలోని వియాస్ ఫార్మా కంపెనీలో రసాయన పదార్థం (కెమికల్) లీకైన ఘటన స్థానికంగా ఆందోళనకు దారితీసింది. కంపెనీ పరిసర ప్రాంతాల్లో వ్యాపించిన దుర్వాసనతో పెరపల్లి నుంచి వెలిమినేడు వైపు వెళ్లే విద్యార్థులు, రైతులు పలువురు అస్వస్థతకు గురైనట్లు సమాచారం.

సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కెమికల్ వాసన కారణంగా కొందరికి కళ్ల మంట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, తలనొప్పి వంటి సమస్యలు ఎదురైనట్లు గ్రామస్తులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రమాదకర రసాయనాల నిర్వహణలో కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందని ఆరోపించిన గ్రామస్తులు, ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే పరిశ్రమల వల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లకుండా కాలుష్య నియంత్రణ మండలి, సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.

ఘటనపై అధికారిక వివరాలు ఇంకా వెలువడాల్సి ఉండగా, బాధితుల ఆరోగ్య పరిస్థితి, కెమికల్ లీకేజీకి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటనతో పెరపల్లి పరిసర ప్రాంతాల్లో మరోసారి పరిశ్రమల భద్రతా ప్రమాణాలపై చర్చ మొదలైంది.

Sthanikam

వియాస్ ఫార్మాలో కెమికల్ లీక్ కలకలం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News