Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:32 AM

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్ బి. హరి సింగ్

23-06-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

ప్రజావాణిలో 114 దరఖాస్తుల స్వీకరణ

ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికగా కొనసాగుతున్న ప్రజావాణి కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా అదనపు కలెక్టర్ బి. హరి సింగ్ జిల్లా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. సోమవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు సమర్పించే దరఖాస్తులకు సంబంధిత శాఖలు నిర్దేశిత ఫార్మాట్‌లో ఖచ్చితమైన సమాచారాన్ని అందించాలని సూచించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా, డివిజన్ స్థాయిలో స్వీకరించిన ప్రజావాణి దరఖాస్తులను తప్పనిసరిగా ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. పాత ప్రజావాణి పోర్టల్‌లో ఇంకా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని, కొత్తగా వచ్చే దరఖాస్తులను వెంటనే పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించినట్లు తెలిపారు.

అన్ని శాఖల డివిజనల్ అధికారులు ప్రజావాణి కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరయ్యేలా జిల్లా అధికారులు పర్యవేక్షించాలని పేర్కొన్నట్లు తెలిపారు. స్థానిక సమస్యలు స్థానికంగానే పరిష్కారమైతే ప్రజలకు ఇబ్బందులు తగ్గుతాయని అభిప్రాయపడినట్లు తెలిపారు.

సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 114 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. వీటిలో భూ సమస్యలకు సంబంధించిన 61 దరఖాస్తులు, డీడబ్ల్యూఓ శాఖకు 12, డీపీఓ శాఖకు 6, డీఆర్‌డీఏకు 2, మిగిలిన 33 దరఖాస్తులు వివిధ శాఖలకు సంబంధించినవిగా గుర్తించి పరిష్కారం కోసం సంబంధిత శాఖలకు పంపినట్లు తెలిపారు.

కార్యక్రమంలో డీఆర్‌డీఓ పీడీ సన్యాసయ్య, సీపీఓ కిషన్ నాయక్, డీఏఓ శ్రీధర్ రెడ్డి, డీఈఓ అశోక్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారి నరసింహారావు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నట్లు తెలిపారు.

Sthanikam

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్ బి. హరి సింగ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News