Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సంగారెడ్డి

గ్రామ ప్రజల అవసరాలే ప్రాధాన్యం.. సర్పంచ్ లావణ్య–మధు

Updated : 22 Jun 2026 20:12 IST
As Preferred Source 1 min read
గ్రామ ప్రజల అవసరాలే ప్రాధాన్యం.. సర్పంచ్ లావణ్య–మధు

సంగారెడ్డి జిల్లా ఆరూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ శ్రీమతి నాయకోటి లావణ్య–మధు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే తమ లక్ష్యమని, ఈ రోడ్డు నిర్మాణంతో కాలనీ ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని తెలిపారు. గ్రామానికి నిధులు మంజూరు చేయించడంలో కృషి చేసిన మాజీ సర్పంచ్ నాయకోటి మధుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మ్యాదరి విఠల్, గ్రామపంచాయతీ సభ్యులు, గ్రామ పెద్దలు, ఉపాధి హామీ సిబ్బంది మరియు కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

గ్రామ ప్రజల అవసరాలే ప్రాధాన్యం.. సర్పంచ్ లావణ్య–మధు

Article Image

సంగారెడ్డి జిల్లా ఆరూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ శ్రీమతి నాయకోటి లావణ్య–మధు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే తమ లక్ష్యమని, ఈ రోడ్డు నిర్మాణంతో కాలనీ ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని తెలిపారు. గ్రామానికి నిధులు మంజూరు చేయించడంలో కృషి చేసిన మాజీ సర్పంచ్ నాయకోటి మధుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మ్యాదరి విఠల్, గ్రామపంచాయతీ సభ్యులు, గ్రామ పెద్దలు, ఉపాధి హామీ సిబ్బంది మరియు కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news