Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:27 PM

దారి అడిగిన రైతులు.. పోలీస్ స్టేషన్ ముందు బైఠాయింపు

11-06-2026 338 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాలలో నేరడ మహిళలు, రైతుల ఆందోళన – ‘ఫిర్యాదు ఎవరు చేశారో చెప్పండి’ అంటూ పోలీసులను నిలదీత

నల్గొండ జిల్లా: చిట్యాల

గ్రామానికి వెళ్లే దారి సమస్య పరిష్కారం కాకపోగా, తమను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వేధిస్తున్నారంటూ నేరడ గ్రామానికి చెందిన మహిళలు, రైతులు చిట్యాల పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. సుమారు 50 కుటుంబాలకు చెందిన మహిళలు, రైతులు బైఠాయించి పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

గాదిరెడ్డిపల్లి నుంచి నేరడ గ్రామానికి వెళ్లే పాత రైతుల దారికి అడ్డంగా బ్రాహ్మణ వెల్లంల కాల్వ నిర్మాణం చేపట్టడంతో రాకపోకలు నిలిచిపోయాయని గ్రామస్థులు తెలిపారు. గతంలో సమస్యపై ఆందోళనలు జరగడంతో కాల్వపై బ్రిడ్జి నిర్మిస్తామని హామీలు ఇచ్చినా అమలు కాలేదని పేర్కొన్నారు.

రైతుల విజ్ఞప్తి మేరకు తాత్కాలిక దారి కోసం మంజూరైన సిమెంట్ గుణా పైపులు కూడా దారి నిర్మాణానికి వినియోగించకుండా కొందరు స్థానిక నాయకులు అమ్ముకున్నారని గ్రామస్థులు ఆరోపించారు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల కాల్వను పూడ్చివేసి ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేశారనే ఆరోపణలతో పోలీసులు నేరడ గ్రామానికి చెందిన కుటుంబాలను స్టేషన్‌కు పిలిపించారు. అయితే తాము ఎలాంటి తప్పు చేయలేదని, దారి కోసం మాత్రమే పోరాడుతున్నామని మహిళలు స్పష్టం చేశారు.“మాపై ఫిర్యాదు చేసిన వ్యక్తి ఎవరు? ఏ కారణంతో కేసులు పెడుతున్నారు?” అని ప్రశ్నించినా పోలీసులు సరైన సమాధానం ఇవ్వలేదని మహిళలు ఆరోపించారు. స్థానిక రాజకీయ నాయకుల మాటలు విని రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.

గ్రామంలో దారి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని, పైపుల వ్యవహారంపై విచారణ జరిపించాలని, రైతులు–మహిళలపై వేధింపులు నిలిపివేయాలని జిల్లా అధికారులను కోరారు. ప్రస్తుతం ఈ ఘటనతో చిట్యాల పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

Sthanikam

దారి అడిగిన రైతులు.. పోలీస్ స్టేషన్ ముందు బైఠాయింపు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News