Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:20 PM

విద్యార్థుల భద్రతే లక్ష్యం – పాఠశాల ఆవరణలో డాగ్ స్క్వాడ్ తనిఖీలు

11-06-2026 151 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జూన్ 15 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాల మేరకు డాగ్ స్క్వాడ్ బృందం నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించింది. గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప, ఉపసర్పంచ్ మొల్ల కరిమ్ సమక్షంలో తరగతి గదులు, పాఠశాల ఆవరణ, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి భద్రతా పరిస్థితులను తనిఖీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యా కార్యక్రమాలు ప్రారంభించేందుకు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా చేపట్టిన ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు గుర్తించబడలేదని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మానూర్ పోలీస్ సిబ్బంది, గ్రామ వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థుల భద్రతే లక్ష్యం – పాఠశాల ఆవరణలో డాగ్ స్క్వాడ్ తనిఖీలు

Article Image

జూన్ 15 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాల మేరకు డాగ్ స్క్వాడ్ బృందం నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించింది. గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప, ఉపసర్పంచ్ మొల్ల కరిమ్ సమక్షంలో తరగతి గదులు, పాఠశాల ఆవరణ, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి భద్రతా పరిస్థితులను తనిఖీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యా కార్యక్రమాలు ప్రారంభించేందుకు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా చేపట్టిన ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు గుర్తించబడలేదని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మానూర్ పోలీస్ సిబ్బంది, గ్రామ వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News