Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 02:28 AM

"పేషెంట్లకు రక్షణ కరువైన 'సురక్ష' ఆసుపత్రి..?" చికిత్సలో నిర్లక్ష్యం వల్ల పేషెంట్ పరిస్థితి విషమించిందంటూ కుటుంబ సభ్యుల ఆరోపణ

11-06-2026 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

పేషెంట్‌కు రక్షణ కల్పించాల్సిన ఆసుపత్రిలోనే నిర్లక్ష్యం చోటుచేసుకుందని ఆరోపిస్తూ ఓ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తున్న ఘటన కలకలం రేపుతోంది. బీపీ డౌన్ కావడంతో కిందపడిపోయిన వ్యక్తిని అత్యవసర చికిత్స కోసం సురక్ష ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్యులు పరిస్థితిని సీరియస్‌గా తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, బీపీ డౌన్ కావడంతో పేషెంట్ ఒక్కసారిగా కిందపడిపోయాడు. వెంటనే ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు "కాపాడండి" అంటూ అతడిని సురక్ష ఆసుపత్రికి తరలించారు. అయితే, బీపీ డౌన్ అయిన కేసే కాబట్టి కొద్దిరోజుల్లో కోలుకుంటాడంటూ వైద్యులు చెప్పారని, పరిస్థితి తీవ్రతను గుర్తించడంలో విఫలమయ్యారని వారు ఆరోపిస్తున్నారు.

పేషెంట్‌ను రెండు రోజుల పాటు ఆసుపత్రిలో ఉంచినప్పటికీ, ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మెరుగుదల కనిపించలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం వైద్యులు చేతులెత్తేసినట్లు వ్యవహరించడంతో, ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.

అక్కడి వైద్యులు రోగి పరిస్థితిని పరిశీలించిన అనంతరం మొదటగా బాడీ స్కాన్ నిర్వహించారా అని ప్రశ్నించగా, సురక్ష ఆసుపత్రిలో అలాంటి పరీక్షలు చేయలేదని చెప్పడంతో ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అనంతరం స్కాన్ నిర్వహించగా, రోగి మెదడులో రక్తం గడ్డకట్టినట్లు (బ్రెయిన్ బ్లడ్ క్లాటింగ్) గుర్తించినట్లు తెలిపారు.

సకాలంలో పరీక్షలు నిర్వహించి, అవసరమైన శస్త్రచికిత్స లేదా ప్రత్యేక వైద్యం అందించి ఉంటే పరిస్థితి ఇంత విషమంగా మారి ఉండేది కాదని ఇతర ఆసుపత్రి వైద్యులు చెప్పినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ప్రస్తుతం పేషెంట్ పరిస్థితి విషమంగా ఉందని, చికిత్స కొనసాగుతోందని తెలిపారు.

ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు, సురక్ష ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంపై సంబంధిత అధికారులు వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రాథమిక పరీక్షలు కూడా చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తమ కుటుంబ సభ్యుడి ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని ఆరోపిస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఈ ఘటనపై సురక్ష ఆసుపత్రి యాజమాన్యం లేదా సంబంధిత వైద్యుల స్పందన ఇంకా వెలువడలేదు. కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలపై ఆసుపత్రి వర్గాల వివరణ రావాల్సి ఉంది. పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉండగా, వైద్య సేవల్లో నిర్లక్ష్యంపై మరోసారి చర్చ మొదలైంది.

ప్రాణాలను కాపాడాల్సిన ఆసుపత్రుల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటే ప్రజల్లో వైద్య సేవలపై నమ్మకం దెబ్బతింటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై అధికారులు ఎలా స్పందిస్తారు, ఎలాంటి చర్యలు తీసుకుంటారనే అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

Sthanikam

"పేషెంట్లకు రక్షణ కరువైన 'సురక్ష' ఆసుపత్రి..?" చికిత్సలో నిర్లక్ష్యం వల్ల పేషెంట్ పరిస్థితి విషమించిందంటూ కుటుంబ సభ్యుల ఆరోపణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News