Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గురువులే సమాజానికి జ్ఞానజ్యోతులు అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 06, 2026 05:13 PM

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఎమ్మెల్యే బాలు నాయక్..

10-06-2026 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

నియోజకవర్గంలో గుడిసెలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యం..

అధికారులతో సమీక్షా సమావేశం అవినీతికి పాల్పడితే సస్పెన్షన్ వేటు..

దేవరకొండ : నియోజకవర్గంలో మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి, రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ బుధవారం ఎంపీడీవోలు, హౌసింగ్ శాఖ అధికారులతో కలిసి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు.

అర్హులకు న్యాయం గుడిసెల రహిత నియోజకవర్గం..

సమావేశంలో ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ.. అర్హులైన పేద కుటుంబాలు ఏ కారణం చేతనైనా 'ఎల్-3' (L3) జాబితాలో ఉండిపోతే, వారి అర్హతలను పునఃపరిశీలించి 'ఎల్-1' (L1) జాబితాలోకి మార్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా గుడిసెలు, తాత్కాలిక మిద్దెల్లో నివసిస్తున్న పేద కుటుంబాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి, వారికి శాశ్వత గృహాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా నిజమైన అర్హులను గుర్తించి ఇండ్లు మంజూరు చేస్తాం. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రస్తుతం 226 గుడిసెలు ఉన్నట్లు గుర్తించాం. ఆయా కుటుంబాలన్నింటికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి దేవరకొండను 'గుడిసెలు లేని నియోజకవర్గం'గా తీర్చిదిద్దడమే మా లక్ష్యం అని అన్నారు. గతంలో లబ్ధిదారులు సొంతంగా నిర్మించుకుని.. బేస్ మెంట్ లెవెల్, స్లాబ్ లెవెల్, లేదా గోడల దశలో నిలిచిపోయిన అసంపూర్తి ఇండ్లను సైతం ఇందిరమ్మ ఇండ్ల పథకం కిందికి మారుస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. ఆయా ఇండ్ల నిర్మాణ దశను బట్టి ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే జమ అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. మొదటి విడతలో ఇండ్లు మంజూరై, సాంకేతిక కారణాల వల్ల బిల్లులు ఆగిపోయిన వారికి త్వరితగతిన నిధులు విడుదలయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.

రూపాయి ఆశించినా సస్పెన్షనే!

ఇందిరమ్మ ఇండ్ల పథకం పేరుతో లబ్ధిదారుల నుంచి ఎవరైనా అధికారులు లేదా ప్రజాప్రతినిధులు డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు వస్తే సహించేది లేదని ఎమ్మెల్యే గట్టిగా హెచ్చరించారు. అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, అవసరమైతే తక్షణమే సస్పెండ్ చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని హౌసింగ్ శాఖ అధికారులు, వివిధ మండలాల ఎంపీడీవోలు, విభాగాధిపతులు మరియు సంబంధిత ప్రభుత్వ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఎమ్మెల్యే బాలు నాయక్..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News