Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:20 PM

ప్రాణాల కంటే విలువైనది ఏదీ లేదు.. ట్రాఫిక్ నియమాలు పాటించండి

10-06-2026 158 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా ఫసల్వాడి గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ (లా అండ్ ఆర్డర్) మహేష్ మురళీధర్ భగవత్ పాల్గొని ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్‌తో కలిసి హాజరైన ఆయన “ఆరైవ్ అలైవ్” కార్యక్రమం ద్వారా ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను వివరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారందరూ సీటు బెల్ట్ వినియోగించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదాలకు ప్రధాన కారణమని, అలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాలను వినియోగించాలని తెలిపారు. గమ్యస్థానానికి చేరుకోవడం ముఖ్యమే అయినప్పటికీ సురక్షితంగా చేరుకోవడం మరింత ముఖ్యమని పేర్కొన్నారు. గ్రామ సర్పంచ్ హరిప్రసాద్ ఫసల్వాడిలో “నో హెల్మెట్ – నో ఎంట్రీ” విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించగా, జిల్లా అధికారులు ప్రజల్లో రోడ్డు భద్రతపై మరింత అవగాహన పెంపొందించాలని పిలుపునిచ్చారు. అనంతరం గ్రామ ప్రజలతో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించి హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత, మహిళలు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

ప్రాణాల కంటే విలువైనది ఏదీ లేదు.. ట్రాఫిక్ నియమాలు పాటించండి

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News