Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జూలై 5న ‘రాజ్యాధికార సమరభేరి’ని విజయవంతం చేయాలి యోగ కార్యక్రమంలో పాల్గొన్న సత్యసాయి జిల్లా అధికారులు సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 10:00 PM

నల్లపోచమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన సబ్ కలెక్టర్

నల్లపోచమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన సబ్ కలెక్టర్

నల్లపోచమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన సబ్ కలెక్టర్
June 07, 2026 06:53 PM 194 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం బోరంచ గ్రామంలో మంజీరా నది ఒడ్డున వెలసిన ప్రసిద్ధ శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఏడు గురువారాలు – ఏడు ఆదివారాల జాతర ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. జాతర ఉత్సవాల్లో భాగంగా ఏడవ ఆదివారం సందర్భంగా నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆశీస్సులు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించగా, సబ్ కలెక్టర్‌కు ఆలయ విశిష్టత, జాతర ఉత్సవాల ప్రాముఖ్యత గురించి వివరించారు. జాతరకు పరిసర ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో దేవస్థానం ప్రధాన అర్చకులు, ఎక్స్ ఆఫీస్ మెంబర్ శ్రీకాంత్ స్వామి, సిద్దు స్వామి, నాగేష్ స్వామి, ప్రవీణ్ స్వామి, ఆలయ సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు. జాతర ఉత్సవాలు భక్తి, సంప్రదాయాల నడుమ వైభవంగా కొనసాగుతున్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News