Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:30 AM

భక్తుల సేవలో భద్రతా సిబ్బంది.. ఒకవైపు ఫిట్‌నెస్, మరోవైపు స్వచ్ఛతకు పెద్దపీట.

10-06-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట,

టీజీ ఎస్పీఎఫ్ (తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్) డీజీ స్వాతి లాక్రా ఆదేశాల మేరకు యాదగిరిగుట్ట ఆలయ భద్రతా విభాగం సిబ్బంది శుక్రవారం ప్రత్యేక ఫిట్‌నెస్ కార్యక్రమం నిర్వహించారు. తులసి కాటేజ్ నుంచి మల్లాపురం వరకు 10 కిలోమీటర్ల పరుగు చేపట్టి శారీరక దృఢత్వానికి ప్రాధాన్యం చాటారు.

అనంతరం యాదాద్రి కొండపై మాడవీధుల్లో ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని నిర్వహించి పరిశుభ్రత పనులు చేపట్టారు. భక్తులకు పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఎస్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ కే. శేషగిరిరావు తెలిపారు.

కార్యక్రమంలో భాగంగా మాడవీధుల్లో పేరుకుపోయిన చెత్తను సేకరించి ట్రాక్టర్ ద్వారా తరలించారు. పరిశుభ్రతతో పాటు ఆరోగ్యకర జీవనశైలిపై అవగాహన పెంచేలా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ రవి, ఏఎస్‌ఐలు, ఎస్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

భక్తుల సేవలో భద్రతా సిబ్బంది.. ఒకవైపు ఫిట్‌నెస్, మరోవైపు స్వచ్ఛతకు పెద్దపీట.

Article Image

యాదగిరిగుట్ట,

టీజీ ఎస్పీఎఫ్ (తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్) డీజీ స్వాతి లాక్రా ఆదేశాల మేరకు యాదగిరిగుట్ట ఆలయ భద్రతా విభాగం సిబ్బంది శుక్రవారం ప్రత్యేక ఫిట్‌నెస్ కార్యక్రమం నిర్వహించారు. తులసి కాటేజ్ నుంచి మల్లాపురం వరకు 10 కిలోమీటర్ల పరుగు చేపట్టి శారీరక దృఢత్వానికి ప్రాధాన్యం చాటారు.

అనంతరం యాదాద్రి కొండపై మాడవీధుల్లో ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని నిర్వహించి పరిశుభ్రత పనులు చేపట్టారు. భక్తులకు పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఎస్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ కే. శేషగిరిరావు తెలిపారు.

కార్యక్రమంలో భాగంగా మాడవీధుల్లో పేరుకుపోయిన చెత్తను సేకరించి ట్రాక్టర్ ద్వారా తరలించారు. పరిశుభ్రతతో పాటు ఆరోగ్యకర జీవనశైలిపై అవగాహన పెంచేలా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ రవి, ఏఎస్‌ఐలు, ఎస్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News