Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:29 PM

వైన్స్ ముందు బైక్‌లో రూ.50 వేల నగదు, ఎస్‌బీఐ చెక్కులు మాయం

11-06-2026 435 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసి వచ్చిన రైతుకు షాక్.. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులపై కేసు

చిట్యాల, నల్గొండ జిల్లా:

నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలోని ఉరుమోడ్ల రోడ్డులో ఉన్న వైన్స్ షాప్ ముందు నిలిపిన బైక్‌లో నుంచి రూ.50 వేల నగదు, రెండు

ఎస్‌బీఐ చెక్కులు అపహరణకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసుల వివరాల ప్రకారం, పిట్టంపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు స్థానిక ఎస్‌బీఐ బ్యాంకు నుంచి వడ్ల విక్రయానికి సంబంధించిన డబ్బును డ్రా చేసుకుని బైక్‌పై చిట్యాలకు వచ్చాడు. అనంతరం ఉరుమోడ్ల రోడ్డులోని వైన్స్ షాప్ వద్ద బైక్‌ను నిలిపి మద్యం కొనుగోలు చేసేందుకు లోపలికి వెళ్లాడు.

కొద్ది సేపటి తర్వాత బయటకు వచ్చి చూసేసరికి బైక్‌లో ఉంచిన రూ.50 వేల నగదు, రెండు ఎస్‌బీఐ చెక్కులు కనిపించలేదు. స్థానికుల సమాచారం మేరకు, ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి నగదు, చెక్కులు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది.

బాధిత రైతు ఫిర్యాదు మేరకు చిట్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Sthanikam

వైన్స్ ముందు బైక్‌లో రూ.50 వేల నగదు, ఎస్‌బీఐ చెక్కులు మాయం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News