Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:13 AM

ఈ నెల 17, 18 తేదీల్లో ఎల్‌ఐసీ ఏజెంట్ల సమాఖ్య (LIAFI) సమావేశాలు

13-06-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

భారతీయ జీవిత బీమా ఏజెంట్ల సమాఖ్య (LIAFI 1964) జనరల్ బాడీ సమావేశాన్ని ఈ నెల 17, 18వ తేదీల్లో నాగోల్‌లోని శుభం కన్వెన్షన్ హాల్లో నిర్వహించనున్నట్లు అడ్వైజరీ బోర్డు కో-చైర్మన్ కౌటికే విఠల్ తెలిపారు. ఈ సమావేశానికి జాతీయ, రాష్ట్ర స్థాయిల నుంచి 3,000 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు.ఈ రెండ్రోజుల సదస్సులో ఏజెంట్లు, పాలసీదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా చర్చించి, భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామని వివరించారు. పాలసీదారుల ప్రయోజనాలే లక్ష్యంగా ఉన్నతాధికారులకు వినతులు సమర్పిస్తామన్నారు. సమాఖ్య బలోపేతానికి అందరి సలహాలతో ముందుకెళ్తామని ప్రధాన కార్యదర్శి ఎస్.బి. శ్రీనివాసచారి తెలిపారు.ఈ సమావేశంలో రాజ్యాంగ కమిటీ చైర్మన్,అడ్వైజరీ పోటీ చైర్మన్ బి ఎన్ చారి, స్వాగత కమిటీ చైర్మన్ సింగారపు శ్రీనివాస్, ప్రెస్ అండ్ పబ్లిసిటీ చైర్మన్ షేక్ షాజహాన్, వైస్ ప్రెసిడెంట్ ఎమ్మెస్ మూర్తి, కోశాధికారి బి శ్రీరామ్ మహిళా ప్రతినిధి హేమలత, సికింద్రాబాద్ డివిజన్ కార్యదర్శి సునీల్ కుమార్, హైదరాబాద్ డివిజన్ కార్యదర్శి సీనయ్య, పబ్లిసిటీ కో చైర్మన్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఈ నెల 17, 18 తేదీల్లో ఎల్‌ఐసీ ఏజెంట్ల సమాఖ్య (LIAFI) సమావేశాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News