Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:58 PM

​ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నూతన అధ్యక్షులు

13-06-2026 188 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన బోయ దేవేందర్, కాసర్ల శ్రీనివాస్ రెడ్డి

​మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని చౌటుప్పల్ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. చౌటుప్పల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన బోయ దేవేందర్, మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన కాసర్ల శ్రీనివాస్ రెడ్డిలు.. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ ఉబ్బు వెంకటయ్యతో కలిసి హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.​తమకు అధ్యక్షులుగా అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి దేవేందర్, శ్రీనివాస్ రెడ్డిలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పార్టీ అధిష్ఠానం తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి నిరంతరం శ్రమిస్తామని పేర్కొన్నారు. కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ, పార్టీ బలోపేతానికి కంకణబద్ధులమై పనిచేస్తామని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అభినందిస్తూ, పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

Sthanikam

​ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నూతన అధ్యక్షులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News