Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:33 AM

ఘనంగా కవాడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

14-06-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కవాడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల 2003-2004 విద్యా సంవత్సర పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం పాఠశాల ఆవరణలో ఘనంగా జరిగింది. దాదాపు 22 సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న విద్యార్థులు ఆనందోత్సాహాల మధ్య తమ పాఠశాల రోజుల మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

ఈ సందర్భంగా చిన్ననాటి స్నేహాలు, గురువులతో అనుబంధం, పాఠశాల జీవితంలోని అనుభవాలను పరస్పరం పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఎన్నో ఏళ్ల తర్వాత సహచరులను కలుసుకోవడం సంతోషంగా ఉందని పలువురు పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన అప్పటి ఉపాధ్యాయులు కుల్డిప్ కుమార్, అశోక్ కుమార్, చంద్ర కాంత్ లను పూర్వ విద్యార్థులు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. విద్యార్థుల విజయాలను చూసి గర్వంగా ఉందని గురువులు అభిప్రాయపడ్డారు. విద్యార్థులు జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.ఆత్మీయత, అనురాగాలు, పాత జ్ఞాపకాల సందడితో సాగిన ఈ సమ్మేళనం అందరినీ అలరించింది. భవిష్యత్తులోనూ ఇలాంటి సమావేశాలను తరచుగా నిర్వహించుకోవాలని పూర్వ విద్యార్థులు నిర్ణయించారు.పాఠశాల అభివృద్ధికి తమ బ్యాచ్ నుండి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ప్రదీఫ్, రాము, బాలకృష్ణ, రవి, కుమార్, నవీన్, శ్రావణ్ కుమార్, ఆనంద్, మహేష్, భాస్కర్, రాజేందర్ రెడ్డి సారయ్య, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా కవాడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News