Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / తాజా వార్తలు

మీనాక్షి నటరాజన్‌ నామినేషన్‌ తిరస్కరణ బీజేపీ కుట్ర దాయం ఝాన్సీ రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు

Updated : 13 Jun 2026 21:01 IST
As Preferred Source 1 min read
మీనాక్షి నటరాజన్‌ నామినేషన్‌ తిరస్కరణ బీజేపీ కుట్ర  దాయం ఝాన్సీ రాజిరెడ్డి  కాంగ్రెస్ పార్టీ నాయకురాలు

మధ్యప్రదేశ్‌ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి మీనాక్షి నటరాజన్‌ నామినేషన్‌ను తిరస్కరించడం బీజేపీ రాజకీయ కుట్రలకు పరాకాష్ట అని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు దాయం ఝాన్సీ రాజిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. బీజేపీ వరుసగా కుట్రలు చేస్తూ దేశంలో ప్రజాస్వామ్యాన్ని అడ్డగోలుగా ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. మొన్నటి వరకు కేవలం ఓట్ల చోరీకి పాల్పడిన ఆ పార్టీ ఇప్పుడు ఏకంగా సీట్ల చోరీకి కూడా దిగడం తీవ్ర ఆందోళన కలిగించే అంశమన్నారు. ప్రస్తుతం ఎన్నికల కమిషన్‌ స్వతంత్రతను కోల్పోయి, బీజేపీ అనుబంధ సంఘంగా పనిచేస్తోందనే అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు.నామినేషన్‌ను తిరస్కరించడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు.నిబద్ధత కలిగిన గాంధేయవాది, కాంగ్రెస్‌ రాజ్యసభ అభ్యర్థి మీనాక్షి నటరాజన్‌ నామినేషన్‌ను కుట్రపూరితంగా తిరస్కరించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని విమర్శించారు.

Sthanikam

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news