Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:32 AM

మోదీ పాలనలో తెలంగాణకు అభివృద్ధి ఫలాలు

మోదీ పాలనలో తెలంగాణకు అభివృద్ధి ఫలాలు

మోదీ పాలనలో తెలంగాణకు అభివృద్ధి ఫలాలు
13-06-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం 12 ఏళ్ల పాలనలో తెలంగాణకు లక్షల కోట్ల రూపాయల నిధులు కేటాయించి అభివృద్ధికి పెద్దపీట వేసిందని బీజేపీ నేతలు పేర్కొన్నారు. భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు నిరంజన్ యాదవ్ ఆధ్వర్యంలో ఐఎస్ సదన్ వినయ్‌నగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.జాతీయ రహదారులు, రైల్వేలు, విద్యా సంస్థలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విశేష ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. విశ్వాసం అభివృద్ధి – ప్రజా సంక్షేమం” నినాదంతో పేదలు, రైతులు, మహిళలు, యువత కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసినట్లు తెలిపారు.

గత 12 ఏళ్లలో దేశం డిజిటల్ సేవలు, మౌలిక సదుపాయాలు, జాతీయ భద్రత, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాల దిశగా గణనీయమైన పురోగతి సాధించిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాష్ట్రవ్యాప్తంగా సమావేశాలు, మేధావుల సమ్మేళనాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

పీఎం ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్, పీఎం కిసాన్ వంటి కేంద్ర పథకాల ద్వారా కోట్లాది మంది లబ్ధి పొందారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి 2028లో తెలంగాణలో బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సురేందర్ రెడ్డి, యాకుత్‌పురా ఇన్‌చార్జ్ వీరేందర్ యాదవ్, నరసింహ, నగర మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చంద్రజీ, అధికార ప్రతినిధి చికోటి ప్రవీణ్, భాగ్యనగర్ జిల్లా మీడియా ఇన్‌చార్జ్ ప్రభ, దశరథ లక్ష్మి, మహేష్ శ్రీనాథ్, నవీన్ బండారి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మోదీ పాలనలో తెలంగాణకు అభివృద్ధి ఫలాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News