Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 06:35 AM

పిట్టల అచ్చయ్య మనకు భౌతికంగా దూరమైన ఆయన ఆశయాలు కొనసాగిస్తాం... బుర్ర శ్రీనివాసు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి

13-06-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

సిపిఎం పార్టీ సీనియర్ నాయకుడు పిట్టల అచ్చయ్య ఆశయాలను కొనసాగిస్తామని ఆయన జీవితమంతా పేద ప్రజల కోసం తపించే వ్యక్తిగా ప్రజల హృదయాలలో చిరస్థాయిగా ఉంటాడని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బుర్ర శ్రీనివాసు అన్నారు. శుక్రవారం సాయంత్రం పిట్టల అచ్చయ్య, అనారోగ్య కారణంగా మృతి చెందాడు. శనివారం అతని భౌతిక కాయంపై ఎర్ర జెండాను కప్పి సిపిఎం పార్టీ నాయకత్వం ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ అచ్చయ్య నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ నాడు నైజాం రజాకార్ల తొత్తులుగా ఉన్న బూర్జువా భూస్వామ్య శక్తులు పేదలను వెట్టి చేయిస్తూ కడు బానిస బ్రతుకులు అనుభవిస్తూ తినడానికి తిండి లేని పరిస్థితుల్లో అనేకమంది కమ్యూనిస్టు యోధులు భీమ్ రెడ్డి నరసింహారెడ్డి మల్లు స్వరాజ్యం గార్ల నాయకత్వంలో ఇక్కడి ప్రజలను చైతన్య పరుస్తూ ఆయా గ్రామాల్లో భూస్వాములు కొనసాగిస్తున్న దౌర్జన్యాలకువ్యతిరేకంగా అనేక పోరాటాలు జరిగిన సందర్భంలో పిట్టల అచ్చయ్య ముందు భాగంలో నిలిచి పలుసార్లు జైలు, నిర్బంధాలు ఎదుర్కొన్నాడని కొనియాడారు భూమికోసం భుక్తి కోసం పోరాటం చేసేదాంట్లో వెనుకడుగు వేయలేదని అన్నారు దోపిడీకి వ్యతిరేకంగా కొనసాగిన పోరాటంలో అలుపెరగకుండా నిలిచిన గొప్ప వ్యక్తిఅని అన్నారు ఎర్రజెండా తన ప్రాణంగా భావించి తన చివరి దశలో పేదలకు అన్యాయం జరిగి తే సహించే వ్యక్తి కాదని అన్నారు ఎర్రజెండా పార్టీ బలహీనపడుతుందని పార్టీ బలపడేటట్లు కృషి చేయాలని ఎన్నోసార్లు చెప్పే వాడని అన్నారు అతని మరణం సిపిఎం పార్టీకే కాకుండా పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాల కు తీరని లోటని అతడు భౌతికంగా లేకున్నా ఆయన ఆశయాలు ఎప్పటికీ ఉంటాయని ఎన్నో కష్టాలు వచ్చినా ఒడిదుడుకులు వచ్చినా తాను నమ్మిన సిద్ధాంతం మీద నిలబడి ఉండే మహోన్నతమైన వ్యక్తి మన నుండి దూరం కావడం బాధాకరమైన విషయమని అన్నారు. అనంతరం వారు పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకుడు పల్లా సుదర్శన్ పార్టీ సీనియర్ నాయకులు బంధు సోమయ్య తన్నీరు యాదగిరి పార్టీ కార్యదర్శి పాల బిందెల జానయ్య బాలయ్య చంద్రయ్య పళ్ళ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పిట్టల అచ్చయ్య మనకు భౌతికంగా దూరమైన ఆయన ఆశయాలు కొనసాగిస్తాం... బుర్ర శ్రీనివాసు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News