Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:22 PM

ప్రజల భద్రతే లక్ష్యం.. ఎన్‌హెచ్-65 పనులను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

05-06-2026 328 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి నుంచి పటాన్‌చెరు వరకు జాతీయ రహదారి-65పై కొనసాగుతున్న రోడ్డు విస్తరణ, నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. రోడ్డు నిర్మాణ పనులు, వాటర్ లాగింగ్ ప్రాంతాలు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ స్తంభాల తరలింపు, నీటి పైప్‌లైన్ల మార్పిడి, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలను పరిశీలించిన కలెక్టర్, ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో తక్షణ భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజీలను స్లాబులతో మూసివేసి ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలు, ఇతర యుటిలిటీలను త్వరగా తరలించాలని, ప్రభావిత భవనాల యజమానులకు పరిహారం చెల్లించి తొలగింపు ప్రక్రియను వేగవంతం చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అలాగే జాతీయ రహదారి పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, చెత్తాచెదారం పేరుకుపోకుండా మున్సిపల్ అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.అనంతరం పెద్దాపూర్ పట్నం డాబా సమీపంలోని కల్వర్టును పరిశీలించిన కలెక్టర్, వర్షపు నీటి ప్రవాహానికి ఆటంకం కలగకుండా వెంట్లను ముందుగానే శుభ్రపరచాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. ప్రజల భద్రత, సౌకర్యాల దృష్ట్యా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి వర్షాకాలానికి ముందే అవసరమైన పనులను పూర్తి చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజల భద్రతే లక్ష్యం.. ఎన్‌హెచ్-65 పనులను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News