Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:10 AM

పట్నంలో ప్రైవేట్ బడి వద్దు.. పల్లెలో ప్రభుత్వ బడే ముద్దు!

09-06-2026 284 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​* మన ఊరి బడిలోనే నాణ్యమైన విద్య

* ఈ ఏడాది నుంచే ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు

* పీపల్ పహాడ్ సర్పంచ్ పులనగారి నాగేశ్వరి అశ్విన్ కుమార్ పిలుపు

పసిప్రాయం నుంచే పిల్లాపాపలను బస్సుల్లో వేసి ఎక్కడో దూరంగా ఉన్న పట్నం ప్రైవేటు పాఠశాలలకు పంపించవద్దని, మన గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని పీపల్ పహాడ్ సర్పంచ్ పులనగారి నాగేశ్వరి అశ్విన్ కుమార్ గ్రామస్తులకు పిలుపునిచ్చారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. మన ఊరి బడిలో కార్పొరేట్ స్థాయికి దీటుగా నాణ్యమైన విద్య అందుతోందని చెప్పారు.

​వంద శాతం ఫలితాలే నిదర్శనం..​గత పదవ తరగతి ఫలితాల్లో తమ గ్రామ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే ఇక్కడి విద్యా ప్రమాణాలకు నిదర్శనమని సర్పంచ్ కొనియాడారు. ఈ అద్భుతమైన ఫలితాల సాధనకు రాత్రింబవళ్లు కృషి చేసిన ఉపాధ్యాయ బృందానికి ఆమె ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

​మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక సహకారంతో ఈ విద్యా సంవత్సరం నుంచే మన పాఠశాలలో ప్రీ-ప్రైమరీ (LKG, UKG) తరగతులు ప్రారంభం కాబోతున్నాయి. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.​గ్రామంలో విద్యావ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తే.. రాబోయే రోజుల్లో గ్రామంలోనే 'ఇంటర్మీడియట్ కాలేజీ'ని ఏర్పాటు చేయడమే తమ ప్రధాన లక్ష్యమని, అది తన కల అని ఆమె ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.

Sthanikam

పట్నంలో ప్రైవేట్ బడి వద్దు.. పల్లెలో ప్రభుత్వ బడే ముద్దు!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News