ప్రభుత్వ దవాఖానాలలో ప్రజలకు సరియైన వైద్యం అందాలి; కొలిశెట్టి యాదగిరిరావు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు
ప్రభుత్వ దవాఖానాలలో ప్రజలకు సరియైన వైద్యం అందాలి; కొలిశెట్టి యాదగిరిరావు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు
Bandi Kiran Kumar
ప్రభుత్వ దవాఖానాలో ప్రజలకు సరైన సమయంలో వైద్యం జరిగి ప్రజల ప్రాణాలను కాపాడే విధంగా ఉండాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు కోరారు. మంగళవారంసిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ప్రభుత్వ దవాఖానాలలో పేదలకు వైద్యం అందాలి కార్పొరేట్ వైద్యం కాదు ప్రజలకు అన్ని రకాల వైద్యం అందే విధంగా ప్రభుత్వ దవాఖానాలు ఉపయోగపడాలని కార్యక్రమంలో భాగంగా తుంగతుర్తి మండలం లోని ప్రభుత్వ దవాఖానాలో సిపిఎం పార్టీ నాయకులు వైద్యశాలను పరిశీలించి సరైన వైద్యం అందుతుందా లేదా సిబ్బంది ఉన్నారా లేదా అనే విషయంలో తెలుసుకొని పార్టీ రాష్ట్ర సభ్యుడు యాదగిరి రావు గారు మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖానాలు ప్రజలకు రక్షణగా ఉండాలి పేద మధ్యతరగతి ప్రజలు వైద్యానికి కార్పొరేటు వైద్యశాలలో డబ్బులు కట్టలేక ఆర్థికంగా భౌతికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ ఆసుపత్రిలో వివిధ రకాల కు సంబంధించిన వైద్యులను నియమించాలని అన్ని రకాల మందులు దవాఖాలలో ఉండాలని ఆయన కోరారు తుంగతుర్తి ప్రభుత్వ వైద్యశాలలో నియోజకవర్గ కేంద్రంగా ఉన్న 26 మంది స్టాఫ్ నర్స్ ఉండేదానికి కేవలం కొద్దిమంది మాత్రమే సిబ్బంది ఉండటం వల్ల ప్రజలకు తగిన వైద్యం అందలేకపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఉన్న ఐదుగురు డాక్టర్లలో ముగ్గురు డిప్టేషన్ మీద ఇద్దరు కాంట్రాక్టు వైద్యులు ఉన్నందువల్ల వచ్చిన వారికి వైద్యవసరిగా అందలేదని అన్నారు ప్రభుత్వ దవాఖానాల్లో పూర్తిగా సిబ్బందిని నియమించి అన్ని రకాల వసతులతో ప్రజలకు సేవలు అందించే విధంగా ఉపయోగపడాలని అన్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్రే మిషన్ ఖరాబ్ అయిందని చిన్నపిల్లల డాక్టర్ లేడని గైనకాలజిస్ట్ లేకపోవడం వల్ల గర్భిణీ స్త్రీలు దూర ప్రాంతాన్ని పోవడం జరుగుతుందని వెంటనే అట్టి పోస్టులను నింపాలని అన్నారు సిపిఎం పార్టీ ప్రజల రక్షణ కోసం ప్రభుత్వ దవాఖానాలలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి నిరంతరం వైద్యులు అందుబాటులో ఉండే విధంగా అధికారులు దృష్టి పెట్టాలని వారు కోరారు
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బుర్ర శ్రీనివాసు మండల కమిటీ సభ్యులు వల్ల సుదర్శన్ ఉప్పుల సోమయ్య జాజుగాల్ల ముత్తయ్య గడ్డం ఎల్లయ్య మడిపేది యాదగిరి కందుకూరి చంద్రయ్య మరియు వైద్యులు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి