Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:24 PM

మానూర్ మండలంలో మూడు ప్రీ-ప్రైమరీ కేంద్రాలకు ఇన్‌స్ట్రక్టర్, ఆయా పోస్టులు

08-06-2026 78 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మానూర్ మండలంలో కొత్తగా మంజూరైన ఎంపీపీఎస్ బోరంచ, ఎంపీపీఎస్ షేలిగిరా, ఎంపీయూపీఎస్ అతిమ్యాల పాఠశాలల ప్రీ-ప్రైమరీ తరగతుల కోసం ఇన్‌స్ట్రక్టర్, ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు మండల విద్యాశాఖాధికారి రాజశేఖర్ షేట్కార్ తెలిపారు. అర్హత కలిగిన స్థానిక అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిర్ణీత గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని కోరారు. గ్రామం,పరిధిలోని స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వనుండగా, అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎంపికైన ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్లకు నెలకు రూ.8,000, ఆయాలకు రూ.6,000 గౌరవ వేతనం అందజేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, అభ్యంతరాల స్వీకరణ, తుది జాబితా విడుదల ప్రక్రియలు జూన్ 9 నుంచి జూన్ 16 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు సంబంధిత ఎంఈఓ కార్యాలయంలో పూర్తి వివరాలు తెలుసుకుని గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని రాజశేఖర్ షేట్కార్ సూచించారు.

Sthanikam

మానూర్ మండలంలో మూడు ప్రీ-ప్రైమరీ కేంద్రాలకు ఇన్‌స్ట్రక్టర్, ఆయా పోస్టులు

Article Image

మానూర్ మండలంలో కొత్తగా మంజూరైన ఎంపీపీఎస్ బోరంచ, ఎంపీపీఎస్ షేలిగిరా, ఎంపీయూపీఎస్ అతిమ్యాల పాఠశాలల ప్రీ-ప్రైమరీ తరగతుల కోసం ఇన్‌స్ట్రక్టర్, ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు మండల విద్యాశాఖాధికారి రాజశేఖర్ షేట్కార్ తెలిపారు. అర్హత కలిగిన స్థానిక అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిర్ణీత గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని కోరారు. గ్రామం,పరిధిలోని స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వనుండగా, అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎంపికైన ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్లకు నెలకు రూ.8,000, ఆయాలకు రూ.6,000 గౌరవ వేతనం అందజేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, అభ్యంతరాల స్వీకరణ, తుది జాబితా విడుదల ప్రక్రియలు జూన్ 9 నుంచి జూన్ 16 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు సంబంధిత ఎంఈఓ కార్యాలయంలో పూర్తి వివరాలు తెలుసుకుని గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని రాజశేఖర్ షేట్కార్ సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News