Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:22 PM

నల్లపోచమ్మ తల్లి సన్నిధిలో వెండి కిరీటం సమర్పించిన భక్త కుటుంబం

09-06-2026 155 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం బోరంచ గ్రామంలో వెలసిన శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి హైదరాబాద్ బేగంబజార్ వాస్తవ్యులు రాయికోడ్ బాలాజీ–కళావతి దంపతులు తమ కుటుంబ సభ్యులు అశ్విని, నరేందర్, లావణ్య, రవీందర్‌లతో కలిసి మొక్కుబడి తీర్చుకుంటూ 480 గ్రాముల వెండి కిరీటాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని ఆశీర్వదించారు. భక్తులు సమర్పించిన వెండి కిరీటాన్ని ఆలయానికి అందజేసిన విషయాన్ని ఆలయ ఈవో శివ రుద్రప్పకు తెలియజేశారు. భక్తి, విశ్వాసాలకు ప్రతీకగా వెండి కిరీటం సమర్పించిన ఈ కుటుంబాన్ని ఆలయ నిర్వాహకులు, భక్తులు అభినందించారు.

Sthanikam

నల్లపోచమ్మ తల్లి సన్నిధిలో వెండి కిరీటం సమర్పించిన భక్త కుటుంబం

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం బోరంచ గ్రామంలో వెలసిన శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి హైదరాబాద్ బేగంబజార్ వాస్తవ్యులు రాయికోడ్ బాలాజీ–కళావతి దంపతులు తమ కుటుంబ సభ్యులు అశ్విని, నరేందర్, లావణ్య, రవీందర్‌లతో కలిసి మొక్కుబడి తీర్చుకుంటూ 480 గ్రాముల వెండి కిరీటాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని ఆశీర్వదించారు. భక్తులు సమర్పించిన వెండి కిరీటాన్ని ఆలయానికి అందజేసిన విషయాన్ని ఆలయ ఈవో శివ రుద్రప్పకు తెలియజేశారు. భక్తి, విశ్వాసాలకు ప్రతీకగా వెండి కిరీటం సమర్పించిన ఈ కుటుంబాన్ని ఆలయ నిర్వాహకులు, భక్తులు అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News