Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:19 AM

నూతన డిప్యూటీ ఆర్‌ఎం లక్ష్మీ ధర్మకు మర్యాదపూర్వక సత్కారం

12-06-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

టీజీఎస్‌ఆర్టీసీ కూకట్‌పల్లి రీజినల్ మేనేజర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన లక్ష్మీ ధర్మను శుక్రవారం పలువురు వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.

రాణిగంజ్ బస్ డిపోకు చెందిన ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ రషీద్, ఎస్సీ-ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఎన్. శ్రీను, కిషన్ తదితరులు ఆమెను కలిసి శాలువా కప్పి, పూలదండతో సత్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, లక్ష్మీ ధర్మ నాయకత్వంలో కూకట్‌పల్లి రీజియన్ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ఉద్యోగుల సంక్షేమానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

అనంతరం లక్ష్మీ ధర్మ మాట్లాడుతూ, తనపై ఉంచిన నమ్మకానికి అనుగుణంగా విధులు నిర్వహిస్తానని, ప్రయాణికుల సౌకర్యాలు మరియు సంస్థ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. తనను కలిసి శుభాకాంక్షలు తెలిపిన సంఘాల ప్రతినిధులకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు.

Sthanikam

నూతన డిప్యూటీ ఆర్‌ఎం లక్ష్మీ ధర్మకు మర్యాదపూర్వక సత్కారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News