Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్య వివాహాలను అరికట్టాలి.. బాలికల విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి:జిల్లా సమన్వయకర్త గడ్డం పల్లవి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 08:31 PM

దళిత క్రైస్తవుల అవగాహన సదస్సును విజయవంతం చేయాలి. ఏఐసీఎఫ్ ఉమ్మడి నల్లగొండ కోఆర్డినేటర్ పి. డేవిడ్ రాజ్ పిలుపు

12-06-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ, : ఈనెల 13న నల్లగొండలో నిర్వహించనున్న దళిత క్రైస్తవుల అవగాహన సదస్సును విజయవంతం చేయాలని ఏఐసీఎఫ్ ఉమ్మడి నల్లగొండ జిల్లా కోఆర్డినేటర్ పి. డేవిడ్ రాజ్ పిలుపునిచ్చారు.

గురువారం పట్టణంలోని గడియారం సెంటర్ సమీపంలో ఉన్న సెల్ఫ్ బాప్టిస్ట్ చర్చిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని, 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండలోని లక్ష్మీ గార్డెన్స్‌లో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సదస్సుకు ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, ఏఐసీఎఫ్ జాతీయ అధ్యక్షుడు గద్దపాటి విజయరాజుతో పాటు క్రైస్తవ నాయకులు, పలు సంఘాల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు.

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించి వారిపై కొనసాగుతున్న వివక్షను తొలగించాలని, సమాజంలో సమాన హక్కులు కల్పించాలని ఆయన కోరారు. డిమాండ్లు నెరవేర్చకపోతే దళిత సంఘాలతో కలిసి ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈనెల 13న జరిగే సదస్సుకు జిల్లాలోని క్రైస్తవులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో సెల్ఫ్ బాప్టిస్ట్ చర్చి అధ్యక్షుడు క్రిస్టఫర్, ఆర్సీఎం చర్చి ఫాదర్ జీవన్, బిషప్ సమర్పన్ కుమార్, హెబ్రోన్ సేవకులు జాకోబు, రిటైర్డ్ సూపరింటెండింగ్ ఇంజనీర్ చిట్యాల పాల్‌రాజ్, హెడ్‌మాస్టర్ ప్రభుదాస్, డి. ప్రేమ్‌కుమార్, మేడి లక్ష్మయ్య, శౌరయ్య, యాచారం యాకోబ్, చింత సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

దళిత క్రైస్తవుల అవగాహన సదస్సును విజయవంతం చేయాలి. ఏఐసీఎఫ్ ఉమ్మడి నల్లగొండ కోఆర్డినేటర్ పి. డేవిడ్ రాజ్ పిలుపు

Article Image

నల్లగొండ, : ఈనెల 13న నల్లగొండలో నిర్వహించనున్న దళిత క్రైస్తవుల అవగాహన సదస్సును విజయవంతం చేయాలని ఏఐసీఎఫ్ ఉమ్మడి నల్లగొండ జిల్లా కోఆర్డినేటర్ పి. డేవిడ్ రాజ్ పిలుపునిచ్చారు.

గురువారం పట్టణంలోని గడియారం సెంటర్ సమీపంలో ఉన్న సెల్ఫ్ బాప్టిస్ట్ చర్చిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని, 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండలోని లక్ష్మీ గార్డెన్స్‌లో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సదస్సుకు ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, ఏఐసీఎఫ్ జాతీయ అధ్యక్షుడు గద్దపాటి విజయరాజుతో పాటు క్రైస్తవ నాయకులు, పలు సంఘాల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు.

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించి వారిపై కొనసాగుతున్న వివక్షను తొలగించాలని, సమాజంలో సమాన హక్కులు కల్పించాలని ఆయన కోరారు. డిమాండ్లు నెరవేర్చకపోతే దళిత సంఘాలతో కలిసి ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈనెల 13న జరిగే సదస్సుకు జిల్లాలోని క్రైస్తవులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో సెల్ఫ్ బాప్టిస్ట్ చర్చి అధ్యక్షుడు క్రిస్టఫర్, ఆర్సీఎం చర్చి ఫాదర్ జీవన్, బిషప్ సమర్పన్ కుమార్, హెబ్రోన్ సేవకులు జాకోబు, రిటైర్డ్ సూపరింటెండింగ్ ఇంజనీర్ చిట్యాల పాల్‌రాజ్, హెడ్‌మాస్టర్ ప్రభుదాస్, డి. ప్రేమ్‌కుమార్, మేడి లక్ష్మయ్య, శౌరయ్య, యాచారం యాకోబ్, చింత సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News