Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:28 PM

ప్రజల కష్టంలో వెంటనే స్పందించిన కౌన్సిలర్ షబానా అజీమ్

11-06-2026 243 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల: నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో కురిసిన భారీ వర్షం, ఈదురుగాలుల కారణంగా రెండో వార్డులోని ఓ భారీ వేపచెట్టు నేలకొరిగి షేక్ గౌస్మియా ఇంటిపై పడింది. చెట్టు కొమ్మలు ఇంటి నిర్మాణంపై విరిగిపడటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.ఘటన విషయం తెలుసుకున్న వెంటనే రెండో వార్డు కౌన్సిలర్ షేక్ షబానా అజీమ్ స్పందించి ఘటనాస్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో ఇంటిపై పడిన భారీ చెట్టు కొమ్మలను తొలగించే చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. ప్రమాదం మరింత పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు.

ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలిచి, ఎలాంటి ఆలస్యం చేయకుండా సహాయక చర్యలు చేపట్టిన కౌన్సిలర్ షబానా అజీమ్ సేవలను స్థానికులు అభినందించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ముందుండే నాయకత్వాన్ని మరోసారి చాటుకున్నారని వార్డు వాసులు పేర్కొన్నారు."ప్రజలకు అవసరం వచ్చిన ప్రతిసారి అందుబాటులో ఉంటూ సేవ చేయడమే నా బాధ్యత" అని ఈ సందర్భంగా కౌన్సిలర్ షేక్ షబానా అజీమ్ తెలిపారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.

Sthanikam

ప్రజల కష్టంలో వెంటనే స్పందించిన కౌన్సిలర్ షబానా అజీమ్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News