Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 03:10 AM

ఘనంగా కోదాడ కాంగ్రెస్ నాయకులు రావెళ్ల కృష్ణారావు జన్మదిన వేడుకలు

11-06-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

కోదాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రావెళ్ల కృష్ణారావు జన్మదిన వేడుకలు గురువారం కోదాడ మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణారావు మిత్ర మండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు, మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబులు రావెళ్ల కృష్ణారావుతో కేక్ కట్ చేయించి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగి, సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకైన పాత్ర పోషిస్తూ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల ప్రచారం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో కృషి చేస్తున్న నాయకుడిగా కృష్ణారావు ప్రత్యేక గుర్తింపు పొందారని కొనియాడారు.

గోపిరెడ్డి నగర్ ప్రాంతంలో వినాయక చవితి ఉత్సవాలు, బతుకమ్మ సంబరాలు, సంక్రాంతి పర్వదినం సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు, యువతకు క్రీడా కార్యక్రమాలు, వివిధ సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణ ద్వారా ప్రజల మన్ననలు పొందిన నాయకుడిగా రావెళ్ల కృష్ణారావు ఎదిగారని పలువురు వక్తలు పేర్కొన్నారు. సేవా దృక్పథం, సామాజిక బాధ్యత, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసే నాయకత్వ లక్షణాలు ఆయనను ప్రజలకు మరింత చేరువ చేశాయని అభిప్రాయపడ్డారు.

భగవంతుని అనుగ్రహంతో ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు కలిగి మరెన్నో జన్మదిన వేడుకలను సంతోషంగా జరుపుకోవడంతో పాటు రాజకీయ, సామాజిక రంగాలలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం మిత్రులు, అభిమానులు శాలువాలతో ఘనంగా సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి, కేక్ తినిపిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా రావెళ్ల కృష్ణారావు మాట్లాడుతూ తన జన్మదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై చూపుతున్న ప్రేమ, ఆదరణ, అభిమానాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటానని పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులు, మిత్రుల సహకారం, పార్టీ నాయకత్వ ప్రోత్సాహంతో మరింత సేవాభావంతో ముందుకు సాగుతానని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఖాజా, పాశం శ్రీనివాసరావు, కాంగ్రెస్ నాయకులు అత్తూరి ప్రసాద్ ( లైటింగ్), మైలార్శెట్టి భాస్కర్, మట్టపల్లి సాలయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, అభిమానులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా కోదాడ కాంగ్రెస్ నాయకులు రావెళ్ల కృష్ణారావు జన్మదిన వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News