Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:25 PM

భారీ వేపచెట్టు కూలి ఇంటికి తీవ్ర నష్టం

భారీ వేపచెట్టు కూలి ఇంటికి తీవ్ర నష్టం

భారీ వేపచెట్టు కూలి ఇంటికి తీవ్ర నష్టం
11-06-2026 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

అయూబ్‌నగర్‌లో భారీ నష్టం.. తృటిలో తప్పిన ప్రాణాపాయం

చిట్యాల, నల్గొండ జిల్లా:

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ రెండో వార్డులోని అయూబ్‌నగర్ కాలనీలో గురువారం భారీ వేపచెట్టు కూలి ఇంటిపై పడడంతో తీవ్ర నష్టం సంభవించింది. కాలనీకి చెందిన షేక్ గౌస్ నివాస గృహంపై ఒక్కసారిగా చెట్టు విరిగి పడటంతో ఇంటి పైకప్పు, గోడలు దెబ్బతిన్నాయి. ఇంట్లోని గృహోపకరణాలు కూడా ధ్వంసమైనట్లు సమాచారం.

ఘటన సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చింది. అయితే చెట్టు కూలిన ప్రభావంతో ఇంటి ఒక భాగం పూర్తిగా దెబ్బతిని కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, వర్షాలు, ఈదురుగాలుల కారణంగా బలహీనపడిన వేపచెట్టు అకస్మాత్తుగా కూలిపోయిందన్నారు. సమాచారం అందుకున్న స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించి నష్టాన్ని అంచనా వేశారు.

ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు స్పందించి బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించాలని కాలనీవాసులు కోరుతున్నారు. ఘటనతో అయూబ్‌నగర్ కాలనీలో కొంతసేపు భయాందోళన నెలకొంది.

Sthanikam

భారీ వేపచెట్టు కూలి ఇంటికి తీవ్ర నష్టం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News