Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:20 PM

అనుమతులు లేని పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్

11-06-2026 97 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకుడు సిహెచ్ అశోక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందజేశారు. సంగారెడ్డి జిల్లాలో అనుమతులు లేకుండా నడుస్తున్న పాఠశాలలు, పాఠశాలలలోనే పుస్తకాలు, యూనిఫాంలు విక్రయిస్తూ తల్లిదండ్రులపై అదనపు భారం మోపుతున్న విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలని కోరారు. అలాగే అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జూన్ 15 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలకు అనుగుణంగా సక్రమంగా నిర్వహించబడేలా అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు సతీష్, రాజ్‌కుమార్, అనూక్, ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అనుమతులు లేని పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్

Article Image

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకుడు సిహెచ్ అశోక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందజేశారు. సంగారెడ్డి జిల్లాలో అనుమతులు లేకుండా నడుస్తున్న పాఠశాలలు, పాఠశాలలలోనే పుస్తకాలు, యూనిఫాంలు విక్రయిస్తూ తల్లిదండ్రులపై అదనపు భారం మోపుతున్న విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలని కోరారు. అలాగే అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జూన్ 15 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలకు అనుగుణంగా సక్రమంగా నిర్వహించబడేలా అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు సతీష్, రాజ్‌కుమార్, అనూక్, ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News