Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:51 AM

సైబర్ సెక్యూరిటీలో డాక్టరేట్‌.. డాక్టర్ మేరుగు రవి కుమార్‌కు డీజీపీ అభినందనలు

12-06-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్, : సైబర్ సెక్యూరిటీ రంగంలో విశిష్ట పరిశోధన చేసి డాక్టరేట్‌ పట్టా పొందిన డాక్టర్ మేరుగు రవి కుమార్‌ను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (టెక్నికల్ సర్వీసెస్) శ్రీ వి.వి. శ్రీనివాస్, ఐపీఎస్ అభినందించారు.

“భారతదేశంలో సైబర్ సెక్యూరిటీ పరిశోధన ఫలితాలపై విశ్లేషణ: రెండు దశాబ్దాల అధ్యయనం (2005–2024)” అనే అంశంపై డాక్టర్ ఉలగనాథన్ మార్గదర్శకత్వంలో పరిశోధన పూర్తి చేసిన రవి కుమార్, కోయంబత్తూరులోని భారతీయార్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు.

భారతదేశంలో సైబర్ సెక్యూరిటీ రంగానికి సంబంధించిన పరిశోధనలను సమగ్రంగా విశ్లేషిస్తూ, భవిష్యత్తు అభివృద్ధికి అవసరమైన పలు సూచనలను తన పరిశోధనలో ప్రతిపాదించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సాధించిన విజయాన్ని కొనియాడుతూ డీజీపీ వి.వి. శ్రీనివాస్ అభినందనలు తెలిపారు.

ప్రస్తుతం వాసవి ఇంజినీరింగ్ కళాశాలలో లైబ్రరీ హెడ్‌గా పనిచేస్తున్న డాక్టర్ మేరుగు రవి కుమార్, తన పరిశోధనను తన గురువు వి.వి. శ్రీనివాస్‌కు అంకితం చేశారు. ఈ విజయానికి సహకరించిన తన జీవిత భాగస్వామి ప్రియాంక, కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరులకు కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే వాసవి ఇంజినీరింగ్ కళాశాల అధ్యక్షుడు పి. రామమోహన్ రావు, కార్యదర్శి పార్థసారథి, సీఈఓ పి. బాలాజీ, ప్రిన్సిపాల్ డా. ఎస్.వి. రమణ, కోశాధికారి ఆనంద్, జాయింట్ సెక్రటరీ పల్లవి తదితరులు డాక్టర్ మేరుగు రవి కుమార్‌ను అభినందించారు.

Sthanikam

సైబర్ సెక్యూరిటీలో డాక్టరేట్‌.. డాక్టర్ మేరుగు రవి కుమార్‌కు డీజీపీ అభినందనలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News