Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:24 PM

ఆపదలో ఉన్న కుటుంబానికి 'జవాన్ సేవా ఫౌండేషన్' బాసట

12-06-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నెలకు సరిపడా నిత్యావసరాల పంపిణీ.. చదువుకు సాయం అందిస్తామని హామీ

ఇంటి పెద్దను కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఒక కుటుంబానికి 'జవాన్ సేవా ఫౌండేషన్ & ట్రస్ట్' మానవత్వంతో అండగా నిలిచింది. సామాజిక బాధ్యతగా సదరు బాధిత కుటుంబానికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులను (రైస్ బ్యాగ్, గోధుమ పిండి, నూనె, పంచదార, శనగపిండి తదితరాలు) సంస్థ ప్రతినిధులు అందజేశారు.

ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. "ఇంటి యజమానిని కోల్పోయిన ఆ కుటుంబానికి మేము ఎల్లప్పుడూ మాకు తోచిన సహాయాన్ని అందిస్తూ అండగా ఉంటాం" అని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా, ఆ కుటుంబంలోని పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, వారి చదువుల నిమిత్తం కూడా తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని ఈ సందర్భంగా నిర్వాహకులు మాట ఇచ్చారు.

దాతలకు కృతజ్ఞతలు:

ఈ సేవా కార్యక్రమానికి ప్రత్యేక విరాళం అందించి అండగా నిలిచిన దాత 'వినయ్' గారి చల్లని మనస్సుకు సంస్థ ప్రతినిధి శివ జవాన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సమాజంలో ఇలాంటి సేవా దృక్పథం కలిగిన దాతల సహకారంతోనే ఎన్నో కుటుంబాలకు అండగా నిలబడగలుగుతున్నామని ఆయన పేర్కొన్నారు.

Sthanikam

ఆపదలో ఉన్న కుటుంబానికి 'జవాన్ సేవా ఫౌండేషన్' బాసట

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News