Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:04 PM

సామాజిక స్పృహతో కూడిన కవిత్వం రావాలి! డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి

12-06-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

కవులు సామాజిక స్పృహతో కవిత్వం రాయాలని, వస్తువులో నవ్యత సాహిత్యాన్ని శాశ్వతం చేస్తుందని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి అన్నారు. తుంగతుర్తి కి చెందిన డాక్టర్ ఎర్ర హరి కిషన్ రచించిన చిత్రం చెప్పిన పద్యం - 2 గ్రంధాన్ని హైదరాబాద్ రవీంద్రభారతిలో ఆయన ఆవిష్కరించి ప్రసంగించారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ... ఎర్రన పేరుతో కవిత్వం రాస్తున్న ఎర్ర హరికిషన్ ఈ వస్తువులు తీసుకున్నా దానిని కవిత్వం చేయగలిగే చందో సామర్ధ్యం ఉన్నా కవి అని కొనియాడారు. భవిష్యత్తులో ఈరోజు సాహిత్య చరిత్రలో నిలిచిపోయే పద్య కావ్యం రాయాలని ఆకాంక్షించారు. మనం వికాస వేదిక అధ్యక్షులు ప్రముఖ సాహితీవేత్త పెద్దిరెడ్డి గణేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ సైన్స్ కళాశాల ఆచార్యులు బోయిళ్ళ వీరయ్య మాట్లాడుతూ హరికిషన్ చిన్ననాటి నుండే సాహిత్యం పట్ల ఎంతో మంది కనబరిచే వారని అన్నారు. తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు డాక్టర్ నాళేశ్వరం శంకరం మాట్లాడుతూ... తుంగతుర్తి గ్రామీణ ప్రాంతం నుంచి పద్యము అలవోకగా రాయగలిగిన గొప్ప కవిగా హరికిషన్ సాహిత్య చరిత్రలో నిలిచిపోతారు అన్నారు. ప్రముఖ సాహితీవేత్త దోరవేటి మాట్లాడుతూ పురాణాలు ఇతిహాసాలు సంస్కృతి, సంస్కృతి, సామాజిక స్పృహ, ప్రముఖుల పై ప్రశంస పద్యాలు మొదలైన వస్తు వైవిధ్యంతో కూడిన ఈ ఖండకావ్యం ధారా శుద్ధితో కూడి ఉన్నదన్నారు. కార్యక్రమంలో గడ్డం కృష్ణారెడ్డి పుస్తక సమీక్ష నిర్వహించారు. పుస్తకాన్ని డాక్టర్ సాగర్ల సత్తయ్యకు అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో గొడితాల వెంకటేశ్వర్లు, శీల అవిలేను, పబ్బతి వెంకటేశ్వర్లు, ఏబెల్ శశి, రంగరాజు, డాక్టర్ మెంతబోయిన సైదులు, అంబేద్కర్, హరీష్ అగ్నిహోత్ర తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సామాజిక స్పృహతో కూడిన కవిత్వం రావాలి! డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News