Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:25 PM

పర్యావరణ పరిరక్షణ పోటీల విజేతలకు అవార్డులు అందజేసిన డీఎఫ్‌వో ప్రసాద్ రెడ్డి

12-06-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ జడ్‌పీహెచ్‌ఎస్ విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖన పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలవగా, సంగారెడ్డి జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌వో) కే.ఏ.వి.ఎస్. ప్రసాద్ రెడ్డి వారికి అవార్డులు అందజేశారు. వైష్ణవి, సహస్ర, నందిని, శ్రీరామ్, సాయి తేజ, జగదీష్‌లు ఈ అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకతతో పాటు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి పోటీలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. చిన్నప్పటి నుంచే ప్రకృతి, పర్యావరణం పట్ల బాధ్యతాయుతమైన దృక్పథం అలవర్చుకొని చెట్ల పెంపకం, సంరక్షణలో ప్రతి విద్యార్థి భాగస్వామి కావాలని సూచించారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ అధికారి అనురాధ, హెచ్‌ఎం మన్మద్ కిషోర్, ఉపాధ్యాయులు చంద్రశేఖర్ ఆచార్య, ఫారెస్ట్ బీట్ అధికారులు కృష్ణగౌడ్, సంజీవ్, వనజ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పర్యావరణ పరిరక్షణ పోటీల విజేతలకు అవార్డులు అందజేసిన డీఎఫ్‌వో ప్రసాద్ రెడ్డి

Article Image

నారాయణఖేడ్ జడ్‌పీహెచ్‌ఎస్ విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖన పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలవగా, సంగారెడ్డి జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌వో) కే.ఏ.వి.ఎస్. ప్రసాద్ రెడ్డి వారికి అవార్డులు అందజేశారు. వైష్ణవి, సహస్ర, నందిని, శ్రీరామ్, సాయి తేజ, జగదీష్‌లు ఈ అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకతతో పాటు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి పోటీలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. చిన్నప్పటి నుంచే ప్రకృతి, పర్యావరణం పట్ల బాధ్యతాయుతమైన దృక్పథం అలవర్చుకొని చెట్ల పెంపకం, సంరక్షణలో ప్రతి విద్యార్థి భాగస్వామి కావాలని సూచించారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ అధికారి అనురాధ, హెచ్‌ఎం మన్మద్ కిషోర్, ఉపాధ్యాయులు చంద్రశేఖర్ ఆచార్య, ఫారెస్ట్ బీట్ అధికారులు కృష్ణగౌడ్, సంజీవ్, వనజ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News