Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:19 PM

టీజీపీఎస్సీ ఫీజుల పెంపు ఉపసంహరించాలి.డీవైఎఫ్‌ఐ

12-06-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ

టీజీపీఎస్సీ ఉద్యోగ దరఖాస్తుల ప్రాసెసింగ్ ఫీజులను భారీగా పెంచిన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా రెవెన్యూ అధికారి ఆర్. దశరథ్‌కు డీవైఎఫ్‌ఐ నాయకులు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో టీజీపీఎస్సీ ప్రాసెసింగ్ ఫీజును రూ.200 నుంచి రూ.1,000కు పెంచడం యువతపై అదనపు ఆర్థిక భారం మోపడమేనన్నారు.

ఇప్పటికే కోచింగ్ ఫీజులు, పుస్తకాల కొనుగోలు, ప్రయాణ ఖర్చులు తదితర వ్యయాలతో నిరుద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఫీజుల పెంపు కారణంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశాలు కూడా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు.

నిరుద్యోగ యువత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఫీజుల పెంపు నిర్ణయాన్ని పునఃసమీక్షించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.

వినతిపత్రం అందజేసిన వారిలో డీవైఎఫ్‌ఐ నాయకులు గుణాలపురి బాలరాజు, బూర్గు గోపి, లింగరాజు, సాయితో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

టీజీపీఎస్సీ ఫీజుల పెంపు ఉపసంహరించాలి.డీవైఎఫ్‌ఐ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News