Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కొండూరులో వైభవంగా బోనాల ఉత్సవాలు అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 06, 2026 09:06 PM

300 మంది వృద్ధులకు ఉచిత ఆశ్రయం.. వృద్ధాశ్రమ నిర్మాణానికి ఆర్. కృష్ణయ్య మద్దతు

14-06-2026 51 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వనస్థలిపురంలో 300 మంది నిరాధార వృద్ధులకు ఉచిత ఆశ్రయం కల్పించే లక్ష్యంతో రెడీ టు సర్వ్ ఫౌండేషన్ చేపట్టిన వృద్ధాశ్రమ నిర్మాణ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ . కృష్ణయ్య మద్దతు ప్రకటించారు.

ఫౌండేషన్ నిర్వాహకులు పెద్ది శంకర్, రాకేష్ దత్తతో పాటు వాలంటీర్లు ఆదివారం ఆర్. కృష్ణయ్యను మర్యాదపూర్వకంగా కలిసి వృద్ధాశ్రమ నిర్మాణ ప్రాజెక్టు వివరాలను వివరించారు. సమాజంలో నిరాధార వృద్ధులకు సురక్షితమైన నివాసం, ఆహారం, వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. ఈ మహత్తర సేవా యజ్ఞానికి తన సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు వృద్ధాశ్రమ నిర్మాణానికి ప్రజల సహకారం అవసరమని తెలిపారు. ఒక్కో చదరపు అడుగు నిర్మాణ వ్యయానికి రూ.3,500 చొప్పున విరాళాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు అందించే ప్రతి చిన్న సహాయం వృద్ధుల జీవితాల్లో భరోసాను నింపుతుందని పేర్కొన్నారు.

సమాజంలోని ప్రతి ఒక్కరూ ఈ సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఫౌండేషన్ పిలుపునిచ్చింది. హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో నిర్మించనున్న ఈ ఉచిత వృద్ధాశ్రమం 300 మంది వృద్ధులకు శాశ్వత ఆదరణ కేంద్రంగా నిలవనుందని నిర్వాహకులు తెలిపారు.

Sthanikam

300 మంది వృద్ధులకు ఉచిత ఆశ్రయం.. వృద్ధాశ్రమ నిర్మాణానికి ఆర్. కృష్ణయ్య మద్దతు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News