Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:21 PM

పెండింగ్ డీఏలు, పీఆర్సీ అమలుపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి

14-06-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మాధవ సదన్‌లో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర సంఘటన కార్యదర్శి హనుమంతరావు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ డీఏ బకాయిలను విడుదల చేయడంతో పాటు, పీఆర్సీ నివేదికను తెప్పించి 51 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలని కోరారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను అమలు చేయాలని, కేజీబీవీ, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది ఎదుర్కొంటున్న వేతనాలు, ఉద్యోగ భద్రత, పదోన్నతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. గురుకుల విద్యాసంస్థల్లో అమలవుతున్న ప్రస్తుత సమయ సారిణి కారణంగా ఉపాధ్యాయులు, విద్యార్థులపై అధిక ఒత్తిడి పడుతోందని, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి దానిని సవరించాలని సూచించారు. ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం, బదిలీలు, పదోన్నతులను పారదర్శకంగా నిర్వహించడం, పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం వంటి సమస్యలను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ చేపట్టేందుకు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సిద్ధంగా ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దత్తాత్రి, జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, రాష్ట్ర కోశాధికారి భాస్కర్ దేశ్, రాష్ట్ర కార్యదర్శి రమేష్, ఇతర రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

పెండింగ్ డీఏలు, పీఆర్సీ అమలుపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News