Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్నేహానికి చావు లేదు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:57 PM

చౌటుప్పల్‌లో ఘనంగా చేగువేరా జయంతి వేడుకలు

14-06-2026 98 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ప్రపంచ విప్లవయోధుడు ఎర్నెస్టో చేగువేరా జయంతి వేడుకలను చౌటుప్పల్ పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకుడు ఆముదాల పరమేశ్ ఆధ్వర్యంలో చేగువేరా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా "ప్రతి అడుగు స్వచ్ఛత వైపు.. నవ నిర్మాణమే జనసేన లక్ష్యం" అనే నినాదంతో పైలాన్ పార్క్, తంగేడు వనంలో ప్రజలకు చెత్తబుట్టలను పంపిణీ చేశారు. అలాగే యువతకు చేగువేరా జీవిత చరిత్ర పుస్తకాలను అందజేశారు.​ఈ సందర్భంగా పరమేశ్ మాట్లాడుతూ.. సరిహద్దులు లేని మానవత్వం కోసం పోరాడిన చేగువేరా సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకుని జనసైనికులు ప్రజా సమస్యలపై ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆముదాల పరమేశ్, బొల్లం మల్లేశ్, చిన్నం ప్రశాంత్, బద్రి రాజు, చిన్నం రాజీవ్, పెద్దగొని లింగస్వామి, సరికొండ సంజయ్, పాశం శ్రీనాథ్, శ్రీకాంత్, ముద్ధం రాజు, గణేష్, దొడ్డి వంశీ, బాలగోని శివ, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్‌లో ఘనంగా చేగువేరా జయంతి వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News