Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:21 PM

56 సార్లు రక్తదానం చేసిన బత్తుల అనిల్ కుమార్‌కు ఘన సన్మానం

14-06-2026 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా సదాశివపేట వీరశైవ లింగాయత్ సమాజ సభ్యులు 56 సార్లు స్వచ్ఛందంగా రక్తదానం చేసి సమాజ సేవలో విశేష కృషి చేస్తున్న బత్తుల అనిల్ కుమార్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సమాజ అధ్యక్షులు గంధిగా రాజు మాట్లాడుతూ రక్తదానం మహాదానమని, ఒకరి రక్తదానం ద్వారా ఎన్నో ప్రాణాలు కాపాడవచ్చని, రక్తానికి ప్రత్యామ్నాయం లేదని పేర్కొన్నారు. ప్రతి ఆరోగ్యవంతుడు స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవతా సేవలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. కార్యనిర్వాహక అధ్యక్షులు అన్మిశెట్టి జయప్రకాశ్ మాట్లాడుతూ ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా రక్తదాతలందరికీ అభినందనలు తెలియజేస్తూ, మరింత మంది యువత రక్తదానానికి ముందుకు వచ్చి ప్రాణదాతలుగా నిలవాలని ఆకాంక్షించారు. “మీ రక్తపు చుక్క – ఎవరికో జీవన దీపం” అని పేర్కొన్నారు. 56 సార్లు రక్తదానం చేసి అనేక మంది ప్రాణాలను కాపాడడంలో తన వంతు పాత్ర పోషిస్తున్న బత్తుల అనిల్ కుమార్ సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అడ్వకేట్ వీరు మహేందర్, కశెట్టి రమేష్, షాబాద్ వీరన్న, తాటికొండ నాగనాథ్, పాండురంగారెడ్డి, బోనగిరి రమేష్ తదితరులు పాల్గొని బత్తుల అనిల్ కుమార్‌ను అభినందించి ఘనంగా సన్మానించారు.

Sthanikam

56 సార్లు రక్తదానం చేసిన బత్తుల అనిల్ కుమార్‌కు ఘన సన్మానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News