Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:34 AM

అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో 5 కిలోమీటర్ల పాదయాత్ర.. జీఓ-20 రద్దు చేయాలని డిమాండ్**

14-06-2026 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రంగా రెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో ప్రతిపాదిత ఏకో టౌన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ 15 గ్రామాల ప్రజలు ఆదివారం భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. గువ్వలేటి గ్రామ చౌరస్తా నుంచి సద్దుపల్లి చౌరస్తా వరకు దాదాపు ఐదు కిలోమీటర్ల వరకు భారీ పాదయాత్ర నిర్వహించి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తమ ఆందోళనను వ్యక్తం చేశారు.

చిన్న రావిరాల సర్పంచ్ పబ్బత్ బాలకిషన్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, రైతులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాదయాత్ర సందర్భంగా "గో బ్యాక్ ఏకో టౌన్" గో బ్యాక్ ఏకో టౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఇప్పటికే మండల పరిధిలోని క్రషర్ యూనిట్లు, మూసీ నది కాలుష్యం కారణంగా ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం జీఓ నంబర్-20 ద్వారా 494 ఎకరాల ప్రభుత్వ భూమిలో నగర చెత్తను తరలించి డంపింగ్ యార్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టడం ఆందోళనకరమని పేర్కొన్నారు.

ఎకో టౌన్ పేరుతో చేపడుతున్న ఈ ప్రతిపాదన వల్ల పరిసర గ్రామాల ప్రజల జీవన విధానం, వ్యవసాయం, భూగర్భ జలాలు తీవ్రంగా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని, మన పిల్లల భవిష్యత్ మన భవిష్యత్ దెబ్బతింటుందని వారు అభిప్రాయపడ్డారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే పునసమీక్షించాలని కోరారు.

జీఓ-20ను వెంటనే రద్దు చేయాలి

ప్రతిపాదిత ఎకో టౌన్ ఏర్పాటుకు సంబంధించిన జీఓ-20ను తక్షణమే రద్దు చేసి, డంపింగ్ యార్డు ఏర్పాటుపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి అన్ని స్థాయిల్లో పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.

Sthanikam

అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో 5 కిలోమీటర్ల పాదయాత్ర.. జీఓ-20 రద్దు చేయాలని డిమాండ్**

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News