Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:48 AM

పిల్లలమర్రిలో సోమవార అమావాస్య వేడుకలు ఘనంగా

15-06-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

రెండు బ్రహ్మసూత్ర శివలింగాలకు విశేష రుద్రాభిషేకం – భారీగా తరలివచ్చిన భక్తులు

అధిక జ్యేష్ఠ మాసం సోమవారం అమావాస్య మహా పర్వదినాన్ని పురస్కరించుకుని చారిత్రాత్మక ప్రాధాన్యం కలిగిన పిల్లలమర్రిలోని రెండు బ్రహ్మసూత్ర శివలింగాల వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

తెల్లవారుజామున ఆలయ అర్చకులు పంచామృతాలతో శివలింగాలకు రుద్రాభిషేకం నిర్వహించి, అనంతరం నిరాజనం, మంత్రపుష్పం సమర్పించారు. తదుపరి ఈశ్వరుడికి విశేష పుష్పాలంకరణ చేయడంతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.విశేష అలంకరణలో భక్తులకు ఈశ్వరుడి దివ్య దర్శనం కలిగింది. అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణమంతా శివనామస్మరణతో మార్మోగింది. పర్వదినం సందర్భంగా భక్తులు కుటుంబ సమేతంగా హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

Sthanikam

పిల్లలమర్రిలో సోమవార అమావాస్య వేడుకలు ఘనంగా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News