Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 12:47 AM

అంజనాపురిలో పోలీసుల మెరుపు తనిఖీలు

అంజనాపురిలో పోలీసుల మెరుపు తనిఖీలు

అంజనాపురిలో పోలీసుల మెరుపు తనిఖీలు
15-06-2026 122 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

26 బైకులు, 6 కార్లు స్వాధీనం – వలస కూలీల వివరాల సేకరణ

జిల్లాలో నేర నియంత్రణతో పాటు ప్రజల్లో భద్రతా భావం పెంపొందించే లక్ష్యంతో సూర్యాపేట రూరల్ పోలీసులు అంజనాపురి, మానసనగర్ కాలనీల్లో సోమవారం తెల్లవారుజామున మెరుపు తనిఖీలు నిర్వహించారు.

జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు సూర్యాపేట డివిజన్ డీఎస్పీ ప్రసన్న కుమార్, రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్ఐ బాలు నాయక్ ఆధ్వర్యంలో సుమారు 80 మంది పోలీసు సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. కాలనీలోని ప్రతి ఇంటిని, అక్కడ నివసిస్తున్న ప్రతి వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలించారు.

ప్రత్యేకంగా రాజస్థాన్, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్న వలస కూలీల వివరాలను సేకరించి వారి నేపథ్యాన్ని పరిశీలించారు. సరైన ధృవీకరణ పత్రాలు లేని 26 ద్విచక్ర వాహనాలు, 6 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, సమాజంలో భద్రతను మరింత బలోపేతం చేయడం, పోలీసులపై ప్రజల విశ్వాసం పెంచడమే ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

ప్రజలు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తెలియని లింకులు క్లిక్ చేయవద్దని, బ్యాంకింగ్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దని సూచించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.

వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు. కొత్త వ్యక్తులకు ఇండ్లు అద్దెకు ఇచ్చే ముందు గుర్తింపు కార్డులు తప్పనిసరిగా తనిఖీ చేయాలని తెలిపారు.

కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే రక్షణ వలయం ఏర్పడి నేరాల నియంత్రణకు దోహదపడుతుందని, అనుమానాస్పద కదలికలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ ప్రజలను కోరారు.

Sthanikam

అంజనాపురిలో పోలీసుల మెరుపు తనిఖీలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News