Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 12:47 AM

ఘనంగా ప్రారంభమైన టేకుమట్ల చౌడమ్మ తల్లి జాతర

15-06-2026 150 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

భక్తులతో కిక్కిరిసిన దేవస్థానం.. ప్రత్యేక పూజలు, బోనాలతో సందడి

సూర్యాపేట మండల పరిధిలోని టేకుమట్ల గ్రామంలో ప్రతి రెండేళ్లకు ఒకసారి అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే శ్రీశ్రీశ్రీ చౌడమ్మ తల్లి–లింగమంతుల స్వామి జాతర సోమవారం ఘనంగా ప్రారంభమైంది. గ్రామమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోగా, భక్తుల జయజయధ్వానాలతో దేవస్థానం పరిసరాలు మార్మోగాయి.

యాదవుల కులదైవంగా ఆరాధించబడే చౌడమ్మ తల్లికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు సమర్పించారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.

మందగంపల ఊరేగింపులు, డీజే శబ్దాలు, సంప్రదాయ ఆటపాటల మధ్య జాతర ఉత్సాహభరితంగా కొనసాగింది. ఆధ్యాత్మికత, సంస్కృతి, సంప్రదాయాల సమ్మేళనంగా ఈ జాతర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

టేకుమట్ల గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి యాదవ సోదరులు పెద్ద సంఖ్యలో హాజరై జాతరను మరింత వైభవంగా నిర్వహించారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ మహోత్సవాన్ని భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ అమ్మవారిని దర్శించుకుని తమ కోరికలను తెలియజేసుకుంటున్నారు.

జాతర సందర్భంగా గ్రామంలో భక్తిశ్రద్ధలు ఉప్పొంగగా, ఆధ్యాత్మిక ఆనందం వెల్లివిరిసింది. చౌడమ్మ తల్లి ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు.

Sthanikam

ఘనంగా ప్రారంభమైన టేకుమట్ల చౌడమ్మ తల్లి జాతర

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News