Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:33 AM

యోగ కార్యక్రమంలో పాల్గొన్న సత్యసాయి జిల్లా అధికారులు

10-06-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

యోగాను కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా జీవితాంతం ఆచరించే ఆరోగ్యకరమైన జీవన విధానంగా ప్రతి ఒక్కరూ స్వీకరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.మౌర్య భరద్వాజ్ పిలుపునిచ్చారు.

బుధవారం ఉదయం అంతర్జాతీయ 12వ యోగా దినోత్సవం–2026 సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర–2026 కార్యక్రమంలో భాగంగా కదిరి శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆలయ ప్రాంగణంలో బుధవారం ఉదయం సామూహిక యోగ కార్యక్రమం నిర్వహించిన యోగాంధ్ర–2026 కార్యక్రమంలో కదిరి ఎం ఎల్ ఏ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, జిల్లా అధికారులు, విద్యార్థులు, సీనియర్ సిటిజన్ లతో కలసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 7 నుంచి జూన్ 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా, అలాగే శ్రీ సత్యసాయి జిల్లాలో యోగాంధ్ర–2026 కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జూన్ 7న లేపాక్షి లో యోగా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని, ప్రస్తుతం గ్రామ స్థాయిలో వివిధ యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.జిల్లాలో యోగా గురువులను గుర్తించి, వారి ద్వారా మాస్టర్ ట్రైనర్లను ఎంపిక చేసి శిక్షణ అందించినట్లు తెలిపారు. అనంతరం ప్రతి సచివాలయానికి యోగా శిక్షకులను గుర్తించి, యోగా ట్రైనర్లను ఎంపిక చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం వారికి శిక్షణ కొనసాగుతోందన్నారు.

ప్రతి సచివాలయంలో యోగా ట్రైనర్లును గుర్తించి గ్రామ స్థాయిలో యోగా శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లో ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రారంభించనున్నట్లు చెప్పారు.

యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా యోగా పోటీలు, యోగా క్విజ్‌లు, ప్రాణాయామం, వ్యక్తిగత యోగా ప్రదర్శనలు తదితర కార్యక్రమాలు గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రజలందరూ రెండు మూడు వారాల కార్యక్రమంగా కాకుండా జీవితాంతం యోగాను అలవాటు చేసుకుని ఆరోగ్యవంతమైన జీవనం గడపాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమం లో ఇన్‌చార్జ్ మున్సిపల్ కమీషనర్ సందీప్ ,ఆర్డీఓ కలావతి,తహసీల్దార్ రెడ్డి శేఖర్,జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

యోగ కార్యక్రమంలో పాల్గొన్న సత్యసాయి జిల్లా అధికారులు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News