Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:16 AM

పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం.

03-05-2026 158 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జబల్‌పూర్,

: తల్లి ప్రేమకు మరణం కూడా అడ్డుకాదని మరోసారి నిరూపించిన విషాద ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. బర్గి డ్యాం వద్ద జరిగిన పడవ ప్రమాదంలో బిడ్డను హత్తుకుని మృతి చెందిన తల్లి దృశ్యం దేశవ్యాప్తంగా కంటతడి పెట్టిస్తోంది.

విహారయాత్రకు వెళ్లిన పర్యాటకులు ప్రయాణిస్తున్న క్రూయిజ్ పడవ ప్రమాదవశాత్తు మునిగిపోవడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఓ తల్లి తన బిడ్డను కాపాడుకునే ప్రయత్నంలో చివరి వరకు హత్తుకుని ప్రాణాలు విడిచింది.

ప్రమాదం జరిగిన గంటల తర్వాత బయటపడిన తల్లి–బిడ్డ మృతదేహాలు అందరినీ కలిచివేశాయి. లైఫ్ జాకెట్ ధరించినప్పటికీ బిడ్డను వదలకుండా చివరి వరకు తన ఒడిలోనే ఉంచుకోవడం తల్లితనానికి నిదర్శనంగా నిలిచింది.

ప్రాణాపాయం తెలిసినా బిడ్డను విడిచిపెట్టలేకపోయిన ఆ తల్లి త్యాగం ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటన తల్లి ప్రేమ గొప్పతనాన్ని మరోసారి చాటి చెబుతోంది.

మృత్యువుతో ఓడినా… తల్లిగా గెలిచింది

బిడ్డను కాపాడాలనే తపనతో చివరి క్షణం వరకు పోరాడిన ఆ తల్లి, మృత్యువుతో ఓడినా తల్లిగా గెలిచిందనే భావన ప్రతి హృదయాన్ని తాకుతోంది. పేగుబంధం ఎంత గొప్పదో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.

Sthanikam

పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News