కదిరిలో ఘనంగా వివేకానంద యూత్ డిస్ట్రిక్ట్ స్టడీ సర్కిల్ ప్రారంభం
కదిరిలో ఘనంగా వివేకానంద యూత్ డిస్ట్రిక్ట్ స్టడీ సర్కిల్ ప్రారంభం
Anjali
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని ఎస్.టి.ఎస్.ఎన్. డిగ్రీ కళాశాలలో యువత ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా మరో కీలక అడుగు పడింది. జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సహకారంతో ఏర్పాటు చేసిన వివేకానంద యూత్ డిస్ట్రిక్ట్ స్టడీ సర్కిల్ నూతన భవనాన్ని ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, జిల్లా విద్యాశాఖాధికారి, విద్యాధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.జిల్లా విద్యార్థులు సివిల్స్, గ్రూప్స్‌తో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షల్లో అత్యుత్తమ విజయాలు సాధించాలనే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ ప్రత్యేక ఆసక్తితో ఈ స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు నాణ్యమైన అధ్యయన వనరులు, నిపుణుల మార్గదర్శకత్వం, కెరీర్ సూచనలు ఒకే వేదికపై అందుబాటులో ఉండేలా ఈ కేంద్రాన్ని రూపొందించారు.
ఈ సందర్భంగా కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ, కదిరి నియోజకవర్గ యువతకు మెరుగైన విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. జిల్లా కలెక్టర్ తీసుకొచ్చిన ఈ వినూత్న కార్యక్రమానికి సంపూర్ణ సహకారం అందిస్తానని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా సివిల్స్, గ్రూప్స్ వంటి అత్యున్నత పోటీ పరీక్షల్లో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ, స్వామి వివేకానంద ఆశయాలను యువత ఆచరణలో పెట్టాలని, జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలంటే క్రమశిక్షణ, అంకితభావం, నిరంతర కృషి అత్యంత అవసరమని విద్యార్థులకు సూచించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి