Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:34 AM

ఎస్ ఐ ఆర్ ప్రక్రియను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

04-07-2026 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఏ. శ్యామ్ ప్రసాద్ శనివారం కదిరి పట్టణంలోని అడపాల వీధి సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ పరిధిలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్‌ (Special Intensive Revision – 2026) ఓటర్ల సర్వే పురోగతిని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ తనిఖీల్లో భాగంగా ఇంటింటికీ నిర్వహిస్తున్న సర్వే ప్రక్రియ, ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, ఓటర్ల వివరాల నమోదు మరియు సమాచార ధృవీకరణ తదితర అంశాలను కలెక్టర్ నిశితంగా తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది, బీఎల్‌ఓల (BLO) పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఓటర్ల సర్వేను వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అత్యంత కచ్చితత్వంతో, పారదర్శకంగా నిర్వహించాలి.ప్రతి ఓటరు వివరాలను నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలు సక్రమంగా నమోదయ్యేలా చూడాలి.సర్వే నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అధికారులు ప్రతిరోజు క్షేత్రస్థాయి పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, నిర్ణీత గడువులోగా సర్వేను విజయవంతంగా పూర్తి చేయాలి.ఈ కార్యక్రమంలో కదిరి మున్సిపల్ కమీషనర్,కదిరి తహసీల్దార్ రెడ్డి శేఖర్, సంబంధిత ఎన్నికల అధికారులు, సచివాలయ సిబ్బంది, బీఎల్‌ఓలు మరియు ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

ఎస్ ఐ ఆర్ ప్రక్రియను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News