హిందూపురం అంబేద్కర్ సర్కిల్ నందు ఏఐఎస్ఎఫ్ నాయకులు నిరసన
హిందూపురం అంబేద్కర్ సర్కిల్ నందు ఏఐఎస్ఎఫ్ నాయకులు నిరసన
Anjali
*నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సమగ్ర విచారణ జరపాలని
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని,నీట్ ప్రవేశ పరీక్షను శాశ్వతంగా రద్దు చేయాలని NTA సంస్థ వైఫల్యానికి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుని, బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలి.కార్పొరేట్ కోచింగ్ మాఫియా అక్రమాలను అరికట్టి, విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడే వ్యవస్థను రద్దు చేయాలి.పేద మరియు గ్రామీణ విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలని aisf నాయకులు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా AISF జిల్లా అధ్యక్షులు నరసింహమూర్తి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షలో చోటుచేసుకున్న అవకతవకలు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టాయి. సుమారు 22 లక్షల మంది విద్యార్థులు వైద్య విద్యలో ప్రవేశం పొందాలనే ఆశయంతో సంవత్సరాల పాటు కష్టపడి సిద్ధమై పరీక్ష రాయగా, పరీక్ష నిర్వహణలో జరిగిన లోపాలు, పేపర్ లీకేజీలు, అక్రమాలు మరియు నిర్లక్ష్య ధోరణి కారణంగా విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విద్యార్థుల జీవితాలతో ఇలా చెలగాటం ఆడటం అత్యంత దురదృష్టకరం. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రవేశ పరీక్షగా భావించే నీట్ పరీక్షపై ప్రజల్లో నమ్మకం దెబ్బతినేలా జరిగిన ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పరీక్షా ప్రక్రియలో ఎక్కడ ఎలాంటి తప్పిదాలు జరిగాయి, ఎవరి ప్రమేయం ఉంది, కార్పొరేట్ కోచింగ్ సెంటర్ల పాత్ర ఏమిటి అనే అంశాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరగాలి. విద్యార్థుల కష్టాన్ని డబ్బు కోసం ఉపయోగించుకునే కోచింగ్ మాఫియాను అరికట్టకుండా ఉంటే భవిష్యత్తులో మరిన్ని అన్యాయాలు జరిగే ప్రమాదం ఉంది.
పరీక్ష రద్దు కావడంతో ఇప్పటికే మానసిక ఒత్తిడికి గురైన విద్యార్థులకు మళ్లీ ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా తిరిగి పరీక్ష నిర్వహించాలి. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా సరైన భద్రతా చర్యలు తీసుకుని, ఎటువంటి అనుమానాలకు తావులేకుండా పరీక్ష నిర్వహించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన పేద విద్యార్థులు ఎంతో కష్టపడి చదివి పరీక్షలకు హాజరవుతుంటారు. అలాంటి విద్యార్థుల ఆశలను నిర్వీర్యం చేసే విధంగా వ్యవస్థ పనిచేయడం అన్యాయం.
NTA సంస్థ పూర్తిగా వైఫల్యం చెందినందున, ఈ పరిస్థితికి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. పరీక్షా నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన వారిని వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. దేశ విద్యా వ్యవస్థను కాపాడాలంటే తప్పు చేసిన వారిపై ఉదాహరణాత్మక చర్యలు అవసరం. లేకపోతే విద్యార్థుల్లో న్యాయంపై నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది.
కార్పొరేట్ కోచింగ్ మాఫియా కారణంగా విద్యా రంగం వ్యాపారంగా మారిపోయింది. అధిక ఫీజులు వసూలు చేస్తూ, పేద విద్యార్థులకు అవకాశాలు దూరం చేస్తున్న ఈ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం నియంత్రించాలి. అందరికీ సమాన అవకాశాలు కల్పించే విధంగా విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలి. గ్రామీణ మరియు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేక అవకాశాలు కల్పించి, సామాన్య కుటుంబాల పిల్లలు కూడా వైద్య విద్యను అభ్యసించే పరిస్థితులు సృష్టించాలి.
ఈ ఘటన దేశ విద్యా వ్యవస్థపై తీవ్ర మచ్చ వేసింది. విద్యార్థుల భవిష్యత్తును రక్షించడంలో విఫలమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలి. విద్యార్థుల జీవితాలతో ఆటలాడే విధానాలకి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ నాయకులు చంద్ర బద్రి గౌరీ శంకర్ సునీల్ రయాన్ నహీద్ తరుణ్ వంశీ అజయ్ కలందర్ తదితర నాయకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి